పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

............ పదినాల్గు వేలు
సదమల గ్రంథవిస్తరమై యెసంగ
నొనరించి పైకథ లుత్తరకాండ
మునఁజెప్పె వాల్శీకిమునినాథుఁ డపుడు"
                                     770-776 పంక్తులు

       ఇందుత్తర కాండమునకు తెనుగు లేదు- తెనుఁగు భాషలో రామాయణ కథా రచన ప్రారంభమైన కాలమునుండి, ఉత్తర కాండము వేఱుగా రచిత మగుచుండెను. ఇరువది నాలుగు వేల శ్లోకములుగల మూలకథ, చతుర్వింశతి గాయత్రీ మహామంత్రవర్ణసంపుటీకరణ మగుటయే యుత్తరకాండ వేఱుపడుటకు కారణమని యూహింపవచ్చును. తక్కిన యుత్తర రామాయణ పద్యకృతియు, కాచవిభుడు, విఠలరాజుల ద్విపద యుత్తర కాండమును, పై యభిప్రాయమును బలపఱచుచున్నవి. కడచిన శతాబ్దిలో యథావాల్మీకములగు రామాయణ రచనలు ప్రారంభమైన నాఁటనుండియు నీ పథకము మాఱినది. శ్రీ గోపినాథము వెంకటకవిగారు షట్కాండలు మాత్రమే తెనిగించిరి. ఆవెనుక శ్రీ వావిలికొలను సుబ్బరావు పంతులుగారును, జనమంచి శేషాద్రిశర్మగారును నుత్తరకాండము గూడ నాంధ్రీకరించిరి. శ్రీపాదవారి శ్రీకృష్ణ రామాయణమున గూడ నుత్తరకాండము గలదు.

        కేవలము గ్రంథసంఖ్య చేతనేకాక, సాహిత్యదృష్టితో పరిశీలించినచో ప్రభుత్వ ప్రకటితములైన గ్రంథములలో