పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


పీఠిక




          మదరాసు రాష్ట్రీయ ప్రభుత్వమువారి సమాదరణమున తంజపూరి సరస్వతీ మహలు గ్రంథాలయమువారి పక్షమున ప్రకటిత మగుచున్న కట్టా వరద రాజు ద్విపద రామాయణము నందలి నాలుగవ సంపుటమగు యుద్ధకాండము నేటితో ముగిసినది. దీనితో నా గ్రంథముద్రణము సంపూర్తియైనది. ప్రభుత్వమువారు ప్రకటించిన ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారము తెలుఁగు గ్రంథములలో గాని, తంజావూరి సరస్వతీ మహలు తెలుఁగు గ్రంథములలో గాని దీనిని మించిన గ్రంథము లేదు. ఇది నాలుగు సంపుటములలో వెలువడినది.
వాని వివరము. పుటలు మొదటి సంపుటము - బాల అయోధ్యా కాండములు 687
రెండవ సంపుటము - అరణ్య కిష్కింధా కాండములు 535
మూడవ సంపుటము - సుందర కాండము 216
నాలుగవ సంపుటము - యుద్ధ కాండము 544
                                                                ________
                                                                 1982
 పీఠికాదులు 128
                                                                 ________
                                                                 2110

        సంస్కృత వాల్మీకి రామాయణమున నాఱుకాండలును, నేనూరు సర్గలును నిరువది నాల్గువేల శ్లోకములు నున్నట్లు వరదరాజే బాల కాండ 32 పుటలో నిట్లు చెప్పియున్నాడు.

        "కతలమీరుచు నాఱుకాండముల్ గాగ
         జతఁగూర్చి యేనూరు సర్గముల్ గలుగ