పుట:Sri Ramayanamu Sundara Kanda Katta Varadaraju 1952 251 P 2030020024835.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆసమయంబున - నఖిలదానవులు
నాసవ సేవా ప - రాయణులగుచు
గురు వెట్టుచును మేని - కోకలు మఱచి
పొరలుచుండఁగఁ గాంచెఁ - బురవీధులందు
బొబ్బలు వెట్టుచుఁ - బొలతుల గబ్బి