209
సుందరకాండము
యీ మేర సీత చో - ప్పెఱిఁగిన వెనుక
నీ మేనఁ బ్రాణము - లేఁటికి నుండు ?
దాళ లేనిఁక నిట్లు - దమ్ముఁడా!”యనుచు
వ్రాలి సౌమిత్రిపై - వాతెఱ యెండ
"రక్షింపవే సుమి - తాపుత్ర ! నన్ను
రక్షింప సుగ్రీవ ! - రావే ” యటంచు
మఱల రాముఁడు పవ - మాన బాలకునిఁ
గరుణారసము చిల్కఁ- గాఁ జూచి పలికె.
"అన్న ! వాయుకుమార ! - యాపన్నునన్ను
మన్నించి ప్రాణముల్ - మఱలింపు మీవు ! 4920
నన్ను నెత్తుకపోయి - నలినాక్షి సీత
యున్న వనంబులో - నునిచి రమ్శివుడు !
ఏల చెప్పితి ' సీతఁ ” - నేఁ గంటిననుచు ?
తే లేవె మూవుపై ? , దేవలెనన్నఁ
జూచియు డించి వ - చ్చునె నిన్నువంటి
ధీ చతురుండు నా - తెఱగెఱిఁగియును ?
ఏమి వల్కెను సీత ? - యెటులోర్చె దనుజ
భామల చేతి ని - ర్బంధంబుకును ?
నీవేమి యంటివి ? - నిమిషమాత్రంబు
నీవలఁ దాళ లే - నెగిరి పోఁజూల 4930
నెట్టులున్నది సీత ? - యేమని మాట
పట్టులిచ్చితి వింకఁ - బ్రదుకునే నెలయు ?
తెలియఁ బల్కుము వెతఁ - దీఱి కొన్నాళ్లు
నిలువరించెద ” నంచు - నిలుపోప లేక