పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



శుభమస్తు.

కట్టా వరదరాజకృతమగు

శ్రీరామాయణము

(ద్విపద)

ఆరణ్యకాండము

——: ఇష్టదేవతాస్తుతి :——

శ్రీరాజితశుభాంగ! - చిరగుణిసంగ
హారికృపాపాంగ! -యలమేలుమంగ
భావుక! శతకోటి - భానుసంకాశ!
సేవకాత్మనివేశ! - శ్రీ వెంకటేశ!
అవధారు! కుశలవు - లా రామచంద్రు
డవధరింపంగ రా - మాయణం బిట్లు
వినుపించు తత్కథా - వృత్తాంతమెల్ల
కనుపించు నవ్వలి - కథ యెట్టులనిన;

——: శ్రీరాముఁడు మునుల యాశ్రమముఁ జూచుట :——



అపుడు రాముఁడు దండ - కారణ్య భూమి
విపులతేజమునఁ బ్ర - వేశంబుఁజేసి