18
ఆరణ్య కాండమున 6518 ద్విపదపంక్తులును, కిష్కింధా కాండమున 6248 మొత్తముమీఁద 12766 పంక్తులీ రామాయణ
భాగమునగలవు మొదటి రెండు కాండములందువలె నిందలి రచనయు సరళమై, హృద్యమై, సర్వజనసులభ గ్రాహ్యమైయున్నది. మొదటి సంపుటము వలెనే యీ సంపుటమును నాంధ్రమహాజను లాదరించి, రామాయణ పఠనమువలన కృతార్థతఁ జెందెదరు గావుత,
ఈ రసవంతమైన ద్విపద వాఙ్మయమును ఆంధ్రలోకమునకు సమర్పించు పట్ల సానుభూతి చూపిన మద్రాసు ప్రభు త్వమువారికి ఆంధ్రలోకము కృతజ్ఞతా బద్ధమగుటలో వెనుకంజ వేయదు
ఈ మహాగ్రంథమంతటికి సంపాదకునిగా నన్ను నియమించిన మదరాసు రాష్ట్రీయ ప్రభుత్వము వారికి, దీనికనుమతినొసగిన మదరాసు విశ్వవిద్యాలయమువారికి నామనఃపూర్వక కృతజ్ఞతా వందనములు, తంజావూరి గ్రంథాలయ గౌరవ కార్యదర్శులు యస్, గోపాలన్ గారికి నిరంతరస్మరణీయ ప్రణామాంజలు. ఈ గ్రంథము నామూలాగ్రమున ముద్రణదోషములను సవరించి, నాకు చేదోడు వాదోడుగానుండిన, చిరంజీవి శివ సుందరేశ్వర రావునకు నాయాశీస్సులు.
ఇతిశివమ్
- ఖర సంవత్సర
- మహా సంక్రాంతి
- 14-1-52
నిడుదవోలు వేంకటరావు
విద్యారత్న, శాస్త్రోపాధ్యాయ
మదరాసు విశ్వవిధ్యాల యాంధ్ర
భాషాశాఖాధ్యక్షుఁడు.