Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16


2. కమలధి - సముద్రము (పుట 519)
" ఇక్క మలధి దాట నెవ్వఁడున్నాఁడు. ”
3. ఇనుఁడు - రాజు (పుట 523)
" ఏముకొల్చిన వారమినుఁడవు నీవు "
4. ఒడలు రూపాంతరము ఒళ్లు. (పుట 146)
5. గరువించుట- గర్వించుట యొక్క రూపాంతరము (పుట 195)
6. కర్మచండాలుఁడు పుట్టుక చేగాక పనుల చేత చండాలుండై న వాఁడు (పుట 206)
7. చాడెడి – జడ లేకకొప్పు. (పుట 228) (చన్నులవ్రేగున చాడె వ్రేగునను) అష్టమహిషీ కళ్యాణము.
8. వైడూర్యము - వైడూర్యముయొక్క రూపాంతరము (పుట 276) వైడూర్యము - చూడ - ప్రాస
9. కుపసము - కుప్పసము రూపాంతరము. (పుట 200)
10. విగ్రహించు - ఎదిరించు, (పుట 313) చూడుఁడు " శ్రీనాథుఁడు నైషధము.” వేయికన్నులవానితో విగ్రహించి -
వనిత ! యిం కేమికానున్న వాఁడొమరుఁడు
11. దీవెన - దీవన రూపాంతరము (పుట 368) " వీఁడె యంగదుఁడు దీవెనలిమ్ము”
12. విగణించు - పరిగణించు, ఉపసర్గవిశేషము. (పుట 378)
13. దిడ్లు - పల్ల కీ మీదపఱ చెడు ముతుక గుడ్డలు. (పుట 386)
14. వరుషము - వర్షమునకు రూపాంతరము. (పుట 386) ఆవరుషరుతు సమాగమంబునకు
15. ధనంజయుఁడు-అగ్ని- బూదినిండిన ధనంజయుఁడు(పుట 390)
16 ఘర్మక రుండు - సూర్యుఁడు (పుట 91) ఆఘర్శకరుఁడు దానాకాశ మంది