15
-ఛందో విశేషములు :-
యతులు
1. నట్టడవినిఁ జిక్కినాఁడు నా చేత ” ఇచ్చటహల్లునకు యతి శ్రీనాథుఁడు నైషధముననిట్లే "నము చిదమనుండు పుత్తెంచినాడు” అనిప్రయోగించినాఁడు ఇట్లే 'నారచీరలు గట్టినారు " అని మఱియొక ప్రయోగ మిందేకలదు.
2. “ రామచంద్ర | వివేకు రాలుమాతార.” (పుట 344) ఇచట హల్లునకు యతి. చిన్నయసూరి సూత్రము ననుసరించిన నచ్చున కేయతి.
3. " ఒక్కొటనదులు నవోఢలోయనఁగ " నవోఢ శబ్దములో స్వరయతి. (పుట 396)
4. " ఉండకదిగువం గూర్చుండివివేక " దేశ్యధాతువుల ప్రత్యయములకు స్వరయతి వీనికి వ్యంజన యతి నిర్దిష్టము (పుట 421)
5. "క్రూరకర్ముఁడు కృతజ్ఞుఁడసత్యపరుఁడు" (పుట 439) ఇచట క్రూ - జ్ఞు అనునది విశేషయతి యని యప్పకవి. కాని యిట్టియతు లప్పకవికి ముందుగలవు.
అ. కర్మమధర్మ మజ్ఞానమాగడము, (పండితారాధ్య చరిత్ర) ఆ. జ్ఞానికి నుపదేశ నిధిప్రకాశము సేయన్ (భారతము తిక్కన) ఇ. జ్ఞానమునం గడవ మిగులఁ గిల్మష మొందున (ప్రౌఢక వి మల్లన) ఈ. ఘ్యము ..... .మిల భవదాజ్ఞాశ క్తి (యథావాక్కుల యన్నమయ్య సర్వేశ్వర శతకము)
శబ్దవి శేషములు
1. కమలాకరము - సముద్రము "ఇక్కమలాకరం బెంత డాఁబూటకు "