Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14


నడవి యయోధ్యగా నన్నింటిమాఱు
పడతిదానయినిల్చి పరితుష్టుఁ జేయు
తలంచినట్ల మెలంగు తనమదిజాప
దలయికఁ జూప దేమనిన సైరించు
నగుమోముతోఁజేరి నా చెంతనిలిచి
తగినమాత్రంబె మెత్తనిమాటలాడు
నట్టిగీతకుఁ బాయునట్టినన్నీవు
చుట్టుకఁదిరిగియే, సుఖముఁ గాంచెదవు
(282-83 పుటలు 182-198 పంక్తులు.)

పై సందర్భములను రంగనాథ రామాయణమున నాయా స్థలములలో సరిచూచిన వరదరాజు ప్రత్యేక రచనా సామర్థ్యము విశదమగును.

వ్యాకరణ విశేషములు

1. చేయుదును అనుటకు “చేతు” అని ప్రయోగించుట.
2. సరస్సునకు సరంబని ప్రయుక్తము.
"మునియున్న యీసరంబునఁ బ్రవేశించి"
3. మణిశబ్దము ఈకారాంతముగాఁ బ్రయోగము
నీటిలో నొక్క మణిమయంబైన
4. అందుక చుట్టుక - మొదలగు ప్రయోగములు
5. క్త్వార్థక సంధి – పడఁకటునిటు - వడఁకి అటునిటు
6. బొక్క సమిండ్లు - బొక్క నపుటిండ్లనుటకు - (పుట 151)
7. కర్మమునకు కర్మువు అను ప్రయోగము - (పుట 283)
పుట్టువును కాలమును కర్మువును