Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

నేరుతునే ధరణీతనూభవను
ముడిచినపువ్వులు ముడిచిన మేర
తొడిగిన సొమ్ములు తొడిగిన కరణిఁ
గట్టినవస్త్రంబుఁ గట్టినయట్లు
పెట్టిన తిలకంబు పెట్టిసమాడ్కి
వేసిన కీల్గంటు వేసినజాడ
చేసినవీడెంబబ చేసిన పోల్కి
నవ్విన నెమ్మోము నవ్విన రీతి
జవ్వని దెచ్చియుంచక మాననిపుడు
(232 పుట. 5525 -5536)

శ్రీరాముఁడు పర్ణశాలయందు సీతనుగానక విలపించు ఘట్టమంతయు (216-221 పుటలు) కరుణరసప్లుతమై యలరారు
చున్నది.

కిష్కింధాకాండమున శ్రీరాముని విరహ వేదనయందు శృంగారకరుణ రసప్రాచుర్యము గన్పట్టుచున్నది.

'కన్నుల నెఱిగించు కలయింగితంబు
చిన్ని నవ్వులఁ దెల్పు చిత్తాభిమతము
సిబ్బితీచేఁజూవు శీలగౌరవము
గబ్బిచిన్నెల నెఱుఁగంగఁ జేయువలపు
యలిగి నేరగయుండదవలి మోమిడదు.
తలపఁ దెవ్వరిని చింతకులోనుగాదు
ఏనుగాసిలియున్న యెఱిగిహితోక్తి
దాసూరడించి సంతాపంబుఁదీర్చు