Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11


పై వానినిబట్టి కొన్ని చోట్ల మూలములోని పదములనే యుపయోగించుచు, భావము నెంత విశదముగా వరదరాజు రచి యించినదియ సువ్యక్తమగుచున్నది.

పూర్వకాండములందువలె నీ రెండు కాండములను వరద రాజుకవితానై పుణ్యమును విశదీకరించుచున్నవి. వర్ణనలు చేయుపట్టుల సంస్కృత సమాసములతో ననుప్రాసములతో వరదరాజు రచించును. ఇదియే తక్కిన వానికంటె యీ గ్రంథమునకు విశిష్టత చేకూర్చినవి.

మచ్చునకు - ఋష్యమూక వర్ణనము - అరణ్య కాండము
అవలోక మాత్ర నిరస్తశోకంబు
దివిజ భూమిదరాంతి ప్రవేశంబు
అపహృతాద్పన్య శ్రమాతి రేకంబు
తపనేందు గణమణి స్థగితరోకంబు
అమరాపగా కృతాత్మాభిషేకంబు
యమదూత గదితనమోనువాకంబు
సారసినీ చరచ్చక్ర వాకంబు
తీరవనీ సము త్తీర్ణ పైకంబు
కందరాంతర విశంకట పనోకంబు
సందీ ప్తశృంగాను షంగినాకంబు
వేలాచరిష్లు గంధేభసాకంబు
తాలాది రసముత్కట వనీకంబు
ఋషి కన్య కాక లావృత ప్రలాకంబు
విషయలో లాసరద్విషదభీకంబు
వాలిసంప్రాప్త భావవ్యళీకంబు