Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ప్రసుప్తపన్నగే నైవనరః పానవశగత”
"క్రూరాత్మకుఁడు నాస్తికుఁడు పతితుండు
చోరుఁడు శరుఁడు నీచుఁడు మద్యపాయి
రమణుల నావుల రాజులద్విజుల
సమయించు వాఁడు పాషండవ ర్తనుఁడు
గురుతల్పగమనుండు కొండీఁడు ద్రోహి
పరివేత్త యన్యాయపరుఁడు హింసకుఁడు
నిరయగాములు గాన నీ కేఁటికయ్య
మీమాంస మీ చర్మ మీదంతశల్య
రోమాదికంబుల రూపగుజంతు
రోయరెవ్వరు వానలధార్మికుండ
వీయపకీర్తి నీవేల నొంది తివి
పంచనఖంబులఁ బరగినజంతు
సంచయంబులనై దు చనుఁగాని మీకుఁ
గడమ వాటిని తినంగా దేమిదలంచి
పడవేసితివి నీకు భక్ష్యంబెయేను
అంటుదురే కేలనైన వానరుల
యొంటిమాంసంబు నిన్నో కనిఁ జూచితిమి
పాపివి యన్యాయపరుఁడవల్పుఁడవు
ద్రోహివి శరుఁడవు దుర్బద్ధి వధమ
సాహసాత్ముఁడవు వంచకుఁడవజ్ఞుఁవు
అక్కట ' దశరథునంత రాజునకు
యొక్కటి సుతుఁడవై యీపు గల్లితివి
(కిష్కింధాకాండ పుటలు 344–345),