Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8


పై విభేదములను జూచిన రామాయణకథ యెట్టిమార్పులను బొందుచుండెడిదియో తెలియఁగలదు

వరదరాజుమూలము నెట్లనుసరించినదియు తెల్పుటకు నొక్కొక్క కాండ నుండి యొక్కొక్క యుదాహరణము నిచ్చు చున్నాఁడను.

ఆరణ్యకాండ, సర్గ 1. శ్లోకములు 18-20

" ధర్మపాలో జనస్యా౽స్య శరణ్యం స్తం మహాయశాః
పూజనీయశ్చ మాన్యశ్చ రాజదండధరో గురుః
ఇంద్రస్యేహ చతుర్భాగః ప్రజారక్షతి రాఘవ
రాజతస్మాద్వరాన్భోగా న్భుం క్తేలోక నమస్కృతః
తేలయలభవతారక్ష్యా భవద్విషయవాసినః
నగరస్థావనస్థావాత్వంనొ రాజాజ నేశ్వర"
"మఘవుఁడు దొర దేవ మండలికెల్ల
రఘువంశజుల కెల్ల రాజువు నీవు
లోకుల కెల్ల నేలుటకునై నీవు
లోకంబుకు నెల్లలో కేశుఁ డొకఁడు
చాలిన వారు దుర్జనుల నడంప
వాలాయమున మంచివారిఁ బోషింప
నీకె భారము మాటనిజము చెల్లింపఁ
జేకొని ధర్మమూర్జితము గావింప
న్యాయమార్గమ్మున నడవకయున్న
నాయవనీపతి నఘములువొందు
నడచినఁగీర్తి యనంత పుణ్యంబు
కడపట స్వర్గలోక సుఖంబుఁ జెందు