Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

ఆరణ్యకాండము,
భాస్కర రామాయణము రంగనాథ రామాయణము వరదరాజ రామాయణము
1. రాముఁడరణ్యమును ప్రవేశించుట కలదు రామునియత్రిమహాముని యాశ్రమమును ప్రవేశించుట (ఇది మూలమున అయోధ్యాకాండాంతముననున్నది.) రాముఁ డరణ్యమును ప్రవేశించుట.(మూలమున నిట్లే యున్నది.}
2. విరాధుని తల్లిదండ్రుల పేర్లు లేవు జయుఁడు తండ్రి శతహ్రద తల్లియనిగలదు జయుఁడు తండ్రి- శతహ్రద తల్లి (మూలమున నిట్లేయున్నది.
3. జంబుమాలివృత్తాంతము కలదు కలదు (ఇందును మూలమునను లేదు)
కిష్కింథాకాండమ.
భాస్కర రామాయణము రంగనాథ రామాయణము వరదరాజ రామాయణము
1. వాలిభార్యయగు తార శ్రీరామచంద్రుని శపించినట్లు కలదు. లేదు లేదు(మూలములోను లేదు)
2. సంపాతి తనకుమారుఁడుగు సుపార్శ్వుని జూచి లంకకుఁబోయి సీతను కనుగొని రమ్మని పంపుట లేదు లేదు(మూలమునను లేదు)
3. హనుమంతుని జన్మవృత్తాంతమునఁ 'గేసరి కథ గలదు. లేదు లేదు(మూలమునను లేదు)
4. హనుమంతుఁడు తనజనన వృత్తాంతముఁ దానే చెప్పుకొనెను. జాంబవంతుఁడు చెప్పినట్లు గలదు. జాంబవంతుఁడు చెప్పినట్లుగలదు. (మూలమునను నిట్లేయున్నది)