ఈ పుట అచ్చుదిద్దబడ్డది
6
మయగారి ద్విపద రామాయణము గలదు. ఈ రామాయణమును పరిష్కరించునపుడును, పైనిచూపినరీతిగా, సంవాదములను పరిశీలించినపుడును, అన్నమయ్య గారి రామాయణకృతిని పూర్తిగ గుర్తించుటకు నవకాశము కలుగునను యభిప్రాయము ధృఢపడినది. పై రెండు సంవాదములలో లేని భాగములన్నియు నన్నమయ గారి కృతిలోనివేయని స్పష్టముగా నిరూపించుటకు తంజావూరి యందేకాక నామూలాగ్రముగా దేశమునందుపలభ్యమగు రంగనాథ రామాయణ ప్రతులన్నింటిని కూలంకషముగా పరిశీలింప వలసియున్నది. అట్లయిన రంగనాథ రామాయణమును గూర్చిన సమస్యలు కూడ సుపరిష్కృతములగునని నాయాశయము
వరదరాజు రామాయణారణ్య కిష్కింధా కాండములను రంగనాథ భాస్కర రామాయణములను సరిపోల్చిచూచిన వరద రాజెట్లు మూలముననుసరించి కథారచనముగావించెనో తెలియఁగలదు.