Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

హరిణంబ కానవే హరిణాయతాక్షి
...........................
తిలకంబ! కానవే తిలకాంచితాస్య
అలినీల కానవే ! యలినీలక చను

వరదరాజు రామాయణము పుట, 217
తిలకంబ! కానవే తిలకలలాట !
నరులార ! కానరేయలినీలక చను
హరిరాజ కానవే హరిరాజమధ్య
కరివరకానవే కరివరగమన
హరిణంబ ! కానవే హరీణాయతాక్షి!(పంక్తి 5168 - 5174)

రంగనాథ రామాయణము (పుట 216.)
"కాకుస్థ! నీవతి కారుణ్యమతివి
లోకైక రక్షణలోల చిత్తుఁడవు"

వరదరాజు రామాయణము (పుట 234)
"కాకుస్థకులదీప ! క్రమమేన నేయ
కారుణ్యమూర్తివి కల్యాణనిధివి"

పైన వివరించిన సంవాదములను పరీక్షించిన, రంగనాథ రామాయణము వ్రాతప్రతులన్నియుఁ బరిశీలించినగాని యా గ్రంథముయొక్క నిజస్వరూపము గుర్తించుటకు వీలుకలుగదు. దానిలో పాఠ భేధములను సంస్కరించుటకు వరదరాజు రామాయణము తోడ్పడును. వరదరాజునకు ముందుగల ద్విపద రామాయణములలో సుప్రసిద్ధ సంకీర్తనాచార్యులగు తాళ్లపాక అన్న