Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3


వరదరాజు రామాయణము (పుట 168.)

నాయింట దాసీజనము లైదువేలు
పాయక మణిమ యాభరణముల్దాల్చి
యచ్చర సతులుగా నతివ నీ సేవ
కిచ్చెద నీమనసిమ్ము నాకపుడు
విరిఁదోఁటలోఁ గల్పవృక్ష పంచకము
తరుణి! ముడిపువ్వు దండలకిత్తు
అమరభూధర రహణాచల మణులు
రమణి ! నీకెత్తు నారతుల కేనిత్తు
ఆమీఁద కామధేన్వాది ధేనువులు
భామిని | నియింటి పాడి కేనిత్తు ” (పంక్తి 3990–4000)

రంగనాథ రామాయణము పుట 204.
పదియవస్థలుదోంచి భాసిల్లుపగిది
పదితలల్ మణిజూట పంక్తులనొప్ప
నాయవస్థలగోర్కులవి యిన్మడింపఁ
బాయని గతినొప్పు బాహులిర్వదియు
ఎరగదివ్యాం బరాధర ణైకకాంత
లరుదార

వరదరాజు రామాయణము, పుట 176
“ పదియవస్థలు దోచు పగిది మస్తముల
ఏదియును మీఱంగఁబది యవస్థలును