Jump to content

పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2


ప్రధమసంపుటమున పీఠికలో కవివంశవృత్తాంతము తెలుపుటచే నిందులో విడిచిపెట్టబడినది. ఈ రెండు కాండములలోగల కవితాభాషా విశేషములను మాత్రమే చూపుటకు నీ పీరిక యావశ్యకమైనది.

ఆ మొదటి పీరికలో నాంధ్రవిశ్వ విద్యాలయమువారు ప్రకటించిన రంగనాథ రామాయణములోని ప్రక్షిప్తభాగములకును, వరదరాజకృతిలోని భాగములకును గల సంవాదములను చూపితిని (చూడుఁడు పుట 37) ఈభాగములందలి సంవాదములను నిందు చూపుచున్నాఁడను

రంగనాథ రామాయణము. (అనుబంధము 1 పుట 678)

“ నాయింట దా ' జనము లైదువేలు
పాయకమణీమ యాభరణముల్దాల్చి
యచ్చరలున్న వారతీవ నిసేవ
కిచ్చేద నీమనసిమ్ము నాకిపుడు
విరిఁదొటలోఁ గల్పవృక్షంబులై దు
తరుణి ! నీముడివువ్వు దండలకిత్తు
అమరభూధరి రోహణాచలమణులు
రమణి ! నీ కెత్తు నారతుల కేనిత్తు
ఆమీద కామధేన్వాధి ధేనువుల
భామిని ! నీయింట పొడి కేనిత్తు ”