Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బురాణములు పదునినిమిది యను విషయము చెప్పఁబడి యున్నది. దీనిని బట్టి యన్ని పురాణములు నొకే కాలమున నొకే ప్రదేశమున రచింపఁబడిన వనియు, నందుచేతనే ప్రతిపురాణము నందును పురాణములు పదునెనిమిది యని పేర్కొనుట కవకాశము గలిగెననియు భావింపరాదు. ఈ పదునెనిమిది సంఖ్య బహుశ: అవి వెలువడిన ప్రదేశముల వైవిధ్యమును బట్టి కలిగియుండవచ్చును. సాధారణముగా దేశమందలి ముఖ్య మత కేంద్రముల నుండి యవి వేఱువేఱుగా వెలువడియుండును. ముఖ్యములైన యాత్రాస్థలముల కా దినములలో బహుసంఖ్యాకులగు జను లరుగుచుండుటచే నా ప్రదేశములే పురాణముల ప్రచారమున కనువైన స్థలములుగా భావింపఁబడుచుండెను. ఆ యా పురాణములందుఁ గనిపించు నా యా యాత్రాస్థలముల వర్ణన విస్తృతిని బట్టి యా యా స్థలములందా యా పురాణము లవతరించెనని యూహింపవచ్చును. ఉదాహరణమునకు గయామాహాత్మ్యమతి విస్తృతముగా జెప్పబడిన పురాణము గయనుండి వెలువడి యుండుననియు, కాశీమహాత్మ్యము విస్తృతముగాఁ జెప్పబడిన పురాణము కాశీనుండి వెలువడి యుండునని భావింపవచ్చును. ఇట్లే ఇతర పురాణము లవతరించిన స్థలములను గూడ నూహించుట కవకాశమున్నది.

"యస్మాత్ పురాహి ఆనతి ఇదం పురాణ"మ్మని వాయుపురాణమున పురాణశబ్దము నిర్వచింపఁబడియున్నది (అధ్యా.1-203). అతి ప్రాచీనకాలము నుండియు జీవించి వచ్చుచుండుటచేఁ బురాణమున కా పేరు కలిగినదని దీని భావము. దీనినిబట్టి లిఖితరూపమును బొందుటకు బూర్వ మతి ప్రాచీన కాలమునుండియుఁ బురాణశబ్దము వాడుకలో నుండెనని యూహింపవచ్చును. "ప్రథమం సర్వశాస్త్రాణాం పురాణంబ్రహ్మణా స్మృతం, అనంతరంచ వక్త్రేభ్యో వేదాన్తన్య వినిస్మృతా:" (1-60) అను వాయుపురాణమందలి శ్లోకము బ్రహ్మచే ప్రప్రథమమునఁ బురాణము స్మరింపఁబడెననియుఁ, బిమ్మట నాతని ముఖములనుండి వేదములు వెలువడెననియుఁ జెప్పుచున్నవి. దీనినిబట్టి మొట్టమొదట నొకే పురాణ ముండెననియు, నది వేదముల కంటెను బ్రాచీనతర మనియుఁ దెలియుచున్నది. వేదగతములైన యితిహాసములను బరిశీలించి చూడఁగా నవి యంతకుముందే ప్రచారమున నుండి వేదములు రూపొంది నప్పుడందెడనెడ నుదాహరింపఁబడిన వని యూహించుట కవకాశము కలుగుచున్నది. దీనినిబట్టి వేదములకుఁ బూర్వమే పురాణములు రచితములై యుండెనని చెప్పుటకు వీలులేక పోయినను అందలి కథేతిహాసములు మాత్ర మతిపురాణ కాలముననే ప్రచారమున నుండి, యప్పటినుండియు నవిచ్ఛిన్నముగా సాగివచ్చుచుండెనని చెప్పుటకు మాత్ర మభ్యంతరము లేదు.

పురాణోత్పత్తిని గూర్చి విష్ణుపురాణమున నింకొక విధముగా జెప్పబడి యున్నది. వానినిబట్టి పురాణోత్పత్తికి బీజము వేదములందే కానవచ్చుచున్నవి. అందలి కధేతిహారములును ప్రార్ధనాపూజా విధానములును బురాణరచయితలకు సర్గ ప్రతిసర్గ భాగములను గూర్దుటలో ననేక విధముల దోద్పడియుండును. ఈభాగములకును బ్రపంచోత్పత్తికిని జాల సన్నిహితమైన సంబంధమున్నది. ఋగ్వేదము నందలి విక్వోత్పత్తికి సంబంధించిన ౠక్కుల ననుసరించియే యని ప్రవచింపబడియుండును. అందిచేతనే మక్డొనల్ ఋగ్వేదమునందలి విశ్వోత్పత్తికి సంబంధించిన ౠక్కులు భారతీయ తత్త్వశాస్త్రమునకే కాక పురాణములకును బీజము లయ్యనని చ్ఫెప్పి యున్నాడు (Hist. of Indian Literature. పుట.188) వేదమునందలి ఋక్కులే