130
వ. దేవా! సర్వ భూతాంతర్యామివై భగవంతుండవైన నీకు నమస్కరించి మదీయ వాంఛితంబు విన్నవించెద నవధరింపుము. అవ్యక్తరూపంబులై వెలుంగు భవదీయ స్థూల సూక్ష రూపంబులును, నానా
శక్త్యుపబృంహితంబు లైన బ్రహ్మాదిరూపంబులును, నీయంత నీవే ధరియించి జగ దుత్పత్తి స్థితి లయంబులం దంతుకీటంబునుం బోలెం గావింపుచు నమోఘ సంకల్పుండవై లీలావిభూతిం గ్రీడించు
మహిమంబు దెలియునట్టి పరిజ్ఞానంబుఁ గృపసేయుము. భవదీయ శాసనంబున జగన్నిర్మాణంబు గావించు నపుడు బ్రహ్మాభిమానంబునం జేసి యవశ్యంబును మహ దహంకారంబులు నా మదిం
బొడముం గావునం దత్పరిహారార్ధంబు వేఁడెద. నన్నుం గృపాదృష్టి విలోకించి దయసేయు మని విన్నవించిన నాలించి పుండరీకాక్షుం డతని కిట్లనియె. (248)
క. వారిజభవ ! శాస్తార్ధవి, చారజ్ఞానమును, భక్తి, సమధిక సాక్షాత్కారము
లను నీ మూఁడు ను, దాతర నీ మనమునందు ధరియింప నగున్. (249)
సీ. పరికింప మత్స్వరూప స్వభావములును మహి తావతార కర్మములుఁ దెలియు
తత్త్వవిజ్ఞానంబు దలకొని మత్ర్పసాదమునఁ గల్గెడి నీకుఁ గమలగర్భ!
సృష్టి పూర్వమునఁ జర్చింప నే నొకరుండఁ గలిగియుండుదు వీతకర్మి నగుచు
సమధిక స్థూల సూక్ష్మ స్వరూపములుఁ దత్కారణ ప్రకృతియుఁ దగ మ దంశ
ఆ. మందు లీనమైన నద్వితీయుండనై, యుండు నాకు నన్య మొకటి లేదు
సృష్టికాలమందు సృష్టినాశంబున, జగము మత్స్యరూప మగును వత్స! (250)
క. అరయఁగఁ గల్ప ప్రళాయం. తరము ననాద్యంత విరహిత క్రియతోడన్
బరిపూర్ణ నిత్య మహిమం, బరమాత్ముఁడనై సరోజభవ ! యే నుందున్. (251)
వ. అదియునుంగాక నీవు న న్నడిగిన యీ జగన్నిర్మాణ మాయా ప్రకారం బెఱింగింతు. లేని యర్థంబు శుక్తి రజత భ్రాంతియుం బోలె నేమిటి మహిమం దోఁచి క్రమ్మఱం దోఁచక మాను నిదియె నా మాయా విశేషం బని యెఱుంగుము. ఇదియునుం గాక లేని యర్థంబు దృశ్యం బగుటకుం, గల యర్థంబు దర్శనగోచరంబు గాకుండుటకును, ద్విచంద్రాదికంబును, తమః ప్రభాసంబును దృష్టాంతంబులుగాఁ దెలియుము. ఏ ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబు