ఈ పుట ఆమోదించబడ్డది
3
ఓం
యద్భక్తిం న వినా ముక్తిః
య స్సేవ్యః సర్వయోగినామ్
తం వందే పరమానంద
ఘనం శ్రీనందనందనమ్.
సప్తమాధ్యాయారంభము
పరాకృత నమ ద్బంధం
పరం బ్రహ్మ నరాకృతిం
సౌందర్య సార సర్వస్వం
వందే నందాత్మజం మహః.
గుణత్రయ విభాగ యోగము
గూఢార్థదీపిక - మధుసూదన సరస్వతి
శ్రీ
లలితా స్కంధము, కృష్ణమూలము, శుకా
లాపాభిరామంబు, మం
జులతా శోభితమున్, సువర్ణ సుమన
స్సుజ్నేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల
వ్యాసాలవాలంబు నై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు
ర్విన్ సద్ద్విజ శ్రేయమై.