Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

107

క. గగనము దన కడవలఁదాఁ, దగ నెఱుఁగని కరణి విభుఁడు దా నెఱుఁగఁడనన్

గగన ప్రసవము లేదన, నగునే సర్వజ్ఞతకును హాని దలింపన్. ( 108 )


చ. తలకొని య మ్మహాత్మకుఁడు దాల్చిన య య్యవతార కర్మముల్

వెలయఁగ నస్మదాదులము వేయు విధంబుల సన్ను తింతు మ

య్యలఘ ననంతునిం జిదచిదాత్మకు నాద్యు ననీశు నీశ్వరున్

దెలియఁగ నేర్తుమే ! తవిలి దివ్యచరిత్రున కేను మ్రొక్కెదన్. ( 109 )


మ. పరమాత్ముం డజుఁ డీ జగంబు ప్రతికల్పంబందుఁ గల్పించుఁ దాఁ

బరిరక్షించును ద్రుంచు నట్టి యనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగ

ద్భరితున్ గేవలు నద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్ము నీ

శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శశ్వన్మూర్తిఁజింతించెదన్. ( 110 )


చ. సరసగతిన్ మునీంద్రులు ప్రసన్నశరీర హృషీక మానస

స్ఫురణ గలప్పు డ వ్విభుని భూరికళా కలిత స్వరూపముం

దరమిడి చూతు రెప్పడు కుతర్క తమోహతి చేత నజ్ఞతన్

బొరసిన యప్పు డ వ్విభుని మూర్తిఁగనుంగొనలేరు నారదా! ( 111 )


వ. అని వెండియు నిట్లను. అనఘా! ఇ మ్మహనీయ తేజోనిధి మొదలి యవతారంబు సహస్ర శీర్షాది యుక్తంబయి ప్రకృతి ప్రవర్తకం బగు నాది పురుషు రూపంబగు. అందుఁ గాల స్వభాషంబులను శక్తు లుదయించె. అందుఁ గార్య కారణ రూపంబైన ప్రకృతి జనించెఁ. బ్రకృతివలన మహత్తత్త్వంబును దాని వలన నహంకార త్రయంబును బుట్టె. అందు రాజసహంకారంబువలన నింద్రియంబులను, సాత్త్వికాహంకారంబువలన నింద్రియ గుణప్రధానంబు లైన యధిదేవతలును, తామసాహంకారంబువలన భూతకారణంబులైన శబ్ద స్పర్శ రూపరస గంధ తన్మాత్రంబులను బొడమె. పంచతన్మాత్రంబులవలన గగనానిలవహ్ని సలిల ధరాదికమైన భూత పంచకంబు గలిగె. అందు జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షు శ్శ్రోత్ర జిహ్వఘ్రాణంబులును, కర్మేంద్రియంబులైన వాక్పాణి పాద పాయూపస్థలును, మనంబును జనియించె. అన్నింటి సంఘాతంబున విశ్వరూపుండైన విరాట్పురుషుండు పుట్టె. అతనివలన స్వయంప్రకాశుండైన స్వరాట్టు సంభవించె. అందుఁ జరాచర రూపంబుల స్థావర జంగమాత్మకంబైన