78
వ. అని సర్పంబుఁ దిగిచు నేర్పులేక యెలుంగెత్తి విలపించుచున్న కుమారకు రోదన ధ్వని విని, యాంగిరసుఁడైన శమీకుండు సమాధిఁ జాలించి, మెల్లన గన్నులు దెఱచి, మూఁపున వ్రేలుచున్న మృతోరగంబు వీక్షించి తీసి పాఱవైచి కుమారకుం జూచి . (474)
క. ఏకీడు నాచరింపము, లోకులకున్ మనము సర్వలోక సములమున్
శోకింపనేల ? పుత్రక ! కాకోదర మేల వచ్చె ? గంఠంబునకున్ . (475)
వ. అని యడిగిన తండ్రికిఁ గిడుకు రాకువచ్చి సర్పంబు వైచుటయుందాను శపించుటయును వినిపించినఁ దండ్రి కొడుకు వలన సంతసింపక యిట్లనియె . (476)
క. బెట్టిదమగు శాపమునకు, దట్టపు ద్రోహంబు గాదు ధరణీకాంతుం
గట్టా ! యేల శపించితి ?, పట్టీ ! తక్షక విషాగ్ని పాలగు మనుచున్. (477)
ఆ. తల్లికడులోన దగ్ధుఁడై క్రమ్మఱఁ, గమలనాభు కరుణవ్ గలిగిఁనాడు
బలిమి గలిగి ప్రజలఁ బాలింపుచున్నాఁడు, దిట్ట వడుగ ! రాజుఁ దిట్టఁ దగునె ?
ఉ. కాపరిలేని గొఱ్ఱియలకై వడిఁ గంటక చోరకోటిచే
నేపఱియున్న దీ భువన మీశుఁడు కృష్ణుఁడు లేమి నిట్టిచో
భూ పరిపాలనంబు సమముద్ధి నితమ్ డొనరింపఁ జెల్లరే !
యీ పరిపాటి ద్రోహమున కిట్లు శపింపఁగనేల ? బాలకా ! (479)
సీ. పాపంబు నీ చేతఁ బ్రాపించె మన కింక రాజు నశించిన రాజ్యమణ్దు
బలవంతఁ డగవాఁడు బలహీను పశు దార హయ సువర్ణాదుల వపహరించు
జార చోరాదులు సంచరింతురు ప్రజ కన్యోన్య కలహంబు లతిశయిల్లు
వైదికంబై యున్న వర్ణాశ్రమాచార ధర్మ మించుక లేక తప్పిపోవు
ఆ. నంతమీఁద లోక లర్థ కామంబులఁ , దగిలి సంచరింప ధరణి నెల్ల
వర్ణ సంకరములు వచ్చును మర్కట, సారమేయ కులము మేరఁ బుత్ర ! (480)
ఉ. భారతవంశజుం బరమభాగవతున్ హయమేధయాజి నా
చారపరున్ మహానయ విశారదు రాజకులైకభుఉషణున్
నీరము గోరి నేఁడు మన నేలకువచ్చిన భక్తి నర్థిస
త్కారము శెసి పంపఁ జనుఁ గాక ! శపింపఁగ నీకు ధర్మమే ! (481)
క. భూపతికి నిరపరాధమ, శాపము దా నిచ్చె బుద్ధిచాపలమున మా
పాపఁడు మీఁ డొనరించిన, పాపము దొలఁగించు కృష్ణ ! పరమేశ ! హరీ ! (482)