77
ఉ. ఆడఁడు దన్ను దూషణము, లాశ్రమవాసులఁహాని వైరులం
గూడఁడు, కందమూలములు కూడుగఁ దించు సమాధి చిత్తుఁడై
వీడఁడు లోనిచూడ్కులను, విష్ణుని దక్కఁ బరప్రపంచముం
జూడఁడు మద్గురుండు ఫణిఁ జుట్టఁగనేటికి ? రాచవానికిన్ . (464)
ఉ. పోము హిరణ్యదానములు పుచ్చుకొనంగ, ధనంబు లేమియుం
దేము, నవంచనంబులుగ దీవెన లిచ్చుచు వేసరింపఁగా
రాము, వనంబులన్ గృహవిరాములమై నివసింపఁ జెల్లరే !
పామును, వైవఁగాఁదగునె ? బ్రహ్మమునీంద్రు భుజార్గళంబునన్ .(465)
క. పుడమిఁగల జనులు వొగడఁగఁ. గుడుతురు గట్టుదురుకాక కువలయపతులై
యడవుల నిడుమలఁ బడియెడి, బడుగుల మెడ నిడఁగ దగునె ? పన్నగశవమున్ .(466)
క. భగవంతుఁడు గోవిందుఁడు, జగతిం బెడఁబాసి చనిన శాసింపంగాఁ
దగువరులు లేమి దుర్జను, లెగసి మహాధునుల నేఁచెద రకటా ! (467)
క. బాలకులార ! ధరిత్రీ. పాలకు శపియింతు ననుచు బలువిడిని విలో
లాలకుఁడగు మునికుంకర, బాలకుఁ డరిగెం ద్రిలోకపాలకు లదరన్ . (468)
వ. ఇట్లు రోషించి కౌశికిఇనదికిం జని కలోపస్పర్శనంబు సేసి . (469)
ఉ. ఓడక వింటికోపున మృతోరగముం గొనివచ్చి మాఱు మా
టాడకయున్న మజ్జనకు సంసతలంబునఁ బెట్టి దుర్మద
క్రీడఁ జరించు రాజు హరకేశవు లడ్డిననైనఁ జచ్చుఁబో
యేడవనాఁడ తక్షక ఫణీంద్ర విషానల హేతిసంహతిన్ . (470)
వ. అని శమీకమహామునికుమారుండైన శృంగి పరీక్షిన్నరేంద్రుని శపియించి, నిజాశ్రమంబునకుఁ జనుదెంచి, కంఠలగ్న కాకోదర కళేబరుండై న తండ్రిం జూచి . (471)
క. ఇయ్యెడ నీ కంఠమునకు, నియ్యురగశవంబు దెచ్చి యిటు చేర్చిన యా
యయ్య నిఁక నేమి సేయుదు ? నెయ్యంబులు లేవు సుమ్ము నపులకుఁ దండ్రీ ! (472)
శా. ప్రారంభంబున వేఁటవచ్చి ధరణీపాలుండు మా తండ్రిపై
నేరం బేముయు లేదు సర్పశవను న్నేఁడుగ్రుఁడై వైచినాఁ
డీరీతిన్న్ ఫణి క్రమ్మఱన్ బ్రతుకునో ! హంసించునో ! కోఱలన్
రారే ! తాపసులార ! దీనిఁ దివరే ! రక్షింపరే ! మ్రొక్కెదన్ . (473)