73
దురాచారమాయా కలహ కపట కలుషాలక్ష్మాదు లాశ్రయుంచు. ( సత్య ధర్మంబులకు ) నిహసంబగు బ్రహ్మావర్తదేశంబున యజ్ఞవిస్తారనిపుణులైనవారు యజ్ఞేశ్వరుండైన హరిం గూర్చి యాగంబు సేయుచున్నవారు. యజించువారలకు సుఖప్రదానంబు సేయుచు, సకల భూతాంతర్యామియై భగవంతుండైన జంగమస్థావరంబులకు నంతరంగ బహిరంగంబుల సంచరించు వాయువుచందంబున, నాత్మరూపంబున మనోరథంబు నిచ్చుఁ గావున నిం దుండవలవదనుచు దండహస్తుండైన జమునికైవడి మండలాగ్రంబు సాఁచిన రాజునకుం గలి యిట్లనియె . (431)
క. జగతీశ్వరా ! నీ యడిదము, ధగధగిత ప్రభలతోడఁ దఱచుగ మెఱయన్
బెగడెం జిత్తము గుండెలు, వగిలెడి నిఁక నెందుఁ జౌత్తు ధావింపఁగదే ! (432)
వ. నరేంద్రా ! నిను (నారోపిత శరశరాసునిఁగ ) సర్వప్రదేశంబులందును విలోకింపుచు నున్నవాఁడా నే నెక్కడనుండుదు నాన తిమ్మనిన రాజన్యశేఖరుండు ప్రాణివధ స్త్రీ ద్యూత పానంబు లనియెడు నాలుగు స్థానంబుల నిచ్చు, మఱియు నడిగిన సువర్ణ మూలంబగు నసత్య మద కామ హింసా వైరంబు లనియెడు పంచప్రదేశంబుల నొసంగి, యితర స్థలంబుల స్పృశియింపకుండ నియమించె. ఇట్లు కలి నిగ్రహంబుచేసి, హీనంబులైన తపశ్శౌచ దయ లనియెడు మూఁడు పాదంబులు వృషభమూర్తియైన ధర్మదేవుని కిచ్చి, విశ్వంభరకు నిర్భరంబైన సంతోషంబు సంపాదించి . (433)
క. గజనామధేయ పురమున, గజరిపుపీఠమున ఘనుఁడు గలిమర్దనుఁడున్
గజవైరి పరాక్రముఁడై, గజిబిజి లేకుండఁ దాల్చెఁ గౌరవరలకక్ష్మిన్ .(434)
అధ్యాయము - 18
వ.ఇట్లు కృష్ణుని యనుగ్రహంబున నశ్వత్థామ బాణపావకంబువలన బ్రతికి పరీక్షిన్న రేంద్రుండు బ్రాహ్మణశాప ప్రాప్త తక్షకధయంబువలనఁ బ్రాణంబులు వోవునని యెఱింగి, సర్వసంగంబులు వర్జించి, శుకునకు శిష్యుండీ, విజ్ఞానంబు గలిగి గంగాతరంగిణీ తీరంబునం గళేబరము విడిచె వినుఁడు. (435)
క. హరివార్త లెఱఁగువారికి, హరిపదములు దలఁచువారి కనవరతంబున్
హరికథలు వినెడివారికి, మరణాగత మోహసంభ్రమము లే దనఘా ! (436)
క. శుభచరితుఁడు హరి యరిగినఁ బ్రభవించి ధరిత్రినెల్లఁ బ్రబ్బియుఁ గలి దా
నభిమన్యుసుతుని వేళను, బభవింపక యణఁగియుండె భార్గవముఖ్యా ! (437)