71
ఉ. వాచవియైన గడ్డి దిని వాహినులందు జలంబుఁ ద్రావఁగా
నీచరణంబు లెవ్వఁ నిర్దశితంబుగఁజేసె, వాఁడు దా
ఖేచరుఁడై న వాని మణి కిఇలిత భూషణయుక్త బాహులన్
వేచని త్రుంచివైతు వినువీథికి నేఁగిన నేల డాఁగినన్ . (417)
వ. అని మఱియు గోరూపయైన బూదేవితో నిట్లనియె . (418)
చ. అగణిత వైభవుండగు మురాంతకుఁ డెక్కడఁ బోయె ? నంచు నె
వ్వగల నశించి నేత్రముల వారికణంబులు దేకుమమ్మ ! లో
బెగడకుమమ్మ ! మద్విశిఖబృందమునన్ వృషలున్ వధింతునా
మగఁటిమిఁ జూడు నీ వెఱపు మానఁగదమ్మ ! శుభప్రదాయినీ ! (419)
క. సాధువులగ జంతువులకు, బాధలు గావించు ఖలుల భంజింపని రా
జాధము నాయు స్స్వర్గ, శ్రీ ధనములు వీటివోవు సిద్ధము తల్లీ ! (420)
క. దుష్టజన నిగ్రహంబును, శిష్టజనానుగ్రహంబుఁ జేయఁగ నృపులన్
స్రష్ట విదించెఁ బురాణ, ద్రష్టలు సెప్పుదురు వరమధర్మము సాధ్వీ ! (421)
వ. అనిన ధర్మనందనపౌత్రునకు వృషధమూర్తి నున్న ధర్మదేవుం డిట్లనియె .( 422)
ఉ. క్రూరులఁ జంపి సాధువులకున్ విజయం బొనరించునట్టి యా
పౌరదవంశ జాతుఁడవు భాగ్యసమేతుఁడ వౌదు తొల్లి మీ
వా రిటువంటివా రవుట వారిజనేత్రుఁడు మెచ్చి దౌత్య సం
చారము సేసెఁ గాదె ! నృపసత్తమ ! భక్తి లతానుబద్ధుడై . (423)
వ. నరేంద్రా ! మేము ప్రాణులకు దుఃఖహేతువులము గాము. మావలన దుఃఖంబు నొందెడు పురుశుండులేఁడు. వాదివాక్యభేదంబుల యోగీశ్వరులు మోహితులై, భేదంబు నాచ్చాదించి, తమకు నాత్మ సుఖదుఃఖంబుల నిచ్చు ప్రభువని చెప్పుదురు. దైవజ్ఞులు గ్రహదేవతాదులకుఁ ప్రభుత్వంబు సంపాదింతురు. మీమాంసకులు గర్మంబునకుం బ్రాభవంబు ప్రకటింతురు. లోకాయతికులు స్వభావంబునకుఁ భభుత్వంబు సంపాదింతురు. ఇందెవ్వరికి సుఖదుఃఖప్రదానంబు సేయ విభుత్వంబు లేదు. పరులవలన దుఃఖంబువచ్చిన నధర్మంబు పరులు చేసిరని విచారింపవలదు. తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరునివలన సర్వము నగుచుండు. అనిన ధర్మదేవునికి ధర్మనందనపౌత్రుఁ డిట్లనియె. (424)