పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

అధ్యాయము - 17

కలిపురుషుండు ధర్మదేవతను దన్నుట

శా. కైలాసాచల సనీభంబగు మహాగంభీర గోరాజమున్

గాలక్రోధుఁడు దండహస్తుఁడు నృపాకారుండు గ్రూరుండు జం

ఘాలుం డొక్కఁడు శూద్రుఁ డాసురగతిం గారుణ్య నిర్ముక్తుఁడై

నేలం గూలఁగదన్నెఁ బంచితిలఁగా నిర్ఘాతపాదాహతిన్ . (409)


శా. ఆలోలాంగక, నశ్రుతోయకణ జాలాక్షిన్, మహాంభారవన్

బాలారూఢ తృణవళీకబళ లోభవ్యాప్త జిహ్వాగ్ర, నాం

దోళస్వాంత సజీవవత్స, నుదయ ద్దుఃఖాన్వితన్, ఘర్మ కీ

లాలాపూర్ణ శరీర నా మొదవు నులంఘించి తన్నెన్ వడిన్ .(410)


వ. ఇట్లా ధేనువృషభంబుల రెంటినిం గంటకుండై తన్నుచున్న రాజలక్షణ ముద్రితుండైన శూద్రునిం జూచి, సువర్ణ పరికర స్యందనారూఢుం డగ నభిమన్యునంద నుండు గోదండంబు సగుణంబు శేసి మేఘగంభీర వచనంబుల నిట్లనియె. (411)


శా. నిన్నుం గొమ్ములఁ జిమ్మెనో ? నిర్భీతివై గోవులం

దన్నం గారణమేమి ? మ ద్భుజ సనాథ క్షోణి నే వేళలం

దు న్నేరంబులు శెయురా దెఱుఁగవా ? ధూర్తత్వమున్ భూమిభృ

త్సన్నాహంబు నొనర్చె దెవ్వఁడవు ? నిన్ శాపించెదన్ దుర్మతీ ! (412)


క. గాండీవియుఁ జక్ర్రియు భూ, మండలి నెడఁబాసి చనిన మదమత్తుఁడవై

దండింపఁ దగనివారల, దండించెదు నీవ తగదు దండనమునకున్. (413)


వ. అని వృషభంబు నుద్దేశించి యిట్లనియె . (414)


మ. కురుధాత్రీశ్వర బాహు వప్రతుగళీ గుప్త క్షమామండలిన్

బరికింపన్ భవదీయ నేత్రజనితాంభః శ్రేణి దక్కన్ జనల్

దొరుఁగం జూడ రధర్మసంజనిత జంతుశ్రేణి బాష్పంబులన్

గురుభక్తిన్ విసళింతుఁ జూడు మితనిన్ గోమూర్తి దేవోత్తమా ! (415)


క. జాలిఁ బడనేల ? నాశర,జాలంబుపాలు సేసి చంఓద వీనిన్

భూలోకంబున నిను నే, నాలుగుపాదముల నిపుడ నడిపింఁతు జుమీ ! (416)