Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68


మ. నయనాంభః కణజాల మేల విడువన్ ? నాతల్లి ! మేన సా

మయమై యున్నది మోము వాడినది నీ మన్నించు చుట్టాలకున్

భయదుఃఖంబులు నేఁడు వొందవుగదా ? బంధించి శూద్రుల్ పద

త్రయహీనన్ ననుఁ బట్టవత్తు రనియో ? తాపంబు నీ కేటికిన్ (394)


సీ.మఖములులేమి నమర్త్యల కిటమీఁద మఖభాగములు లేక మాన ననియొ ?

రమణులు రమణుల రక్షింప రనియొ ? తత్పుత్రులఁ దండ్రులు ప్రోవరనియొ ?

భారతి గుజనులఁ బ్రాపించు ననియొ ? సద్విప్రుల నృపులు సేవింప రనియొ ?

కులిశహస్తుఁడువాన గురియింపకుండఁగ బ్రజలు దుఃఖంబునఁబడుదు రనియొ ?

ఆ. హీనవంశజాతు లేలెద రనియొ ? రా, జ్యముల పాడిగలిగి జరగ వనియొ ?

మనుజ లన్నపాన మైథున శయనాస, నాది కర్మసక్తు లగుదు రనియొ ? (395)


మ. జననీ ! నీ భరమెల్ల డింపుటకినై చక్రయుధం డిన్ని హా

యనముల్ గేళి నరాకృతిన్ మెలఁగి నిత్యానందముం జేసి పో

యిన నే ననాథనైతిఁ గుజనుం డెవ్వాఁడు శాసించునో ?

పెనుదుఃఖంబులు పొంచు ననియో ? భీతిల్లి చింతించుటల్ .(396)


క. దెప్పరమగు కాలముచే, నెప్పుడు దేనతలసెల్ల నష్టంబగు నీ

యొప్పిదముఁ గృష్ణుఁ డరిగినఁ , దెప్పఁగదా ! తల్లి ! నీవు తల్లడపదఁగన్ .(397)


వ. అనిన భూదేవి యిట్లనియె .(398)


క. ఈ లోకంబునఁ బూర్వము, నాలుగుపాదముల నీవు నడతువు నేఁ డా

శ్రీలలనేశుఁడు లేమిని, గాలముచే నీకు నొటికా లయ్యెఁగదే ! (399)


వ. మఱియు సత్య శాచ దయా క్షాంతి త్యాగ సంతోషార్జవంబును, శమ దమ తపంబులును, సామ్యంబును, పరాపరాధసహనంబును, లాభంబుగలయెడ నుదాసీనుండై యుండుటయును, శాస్త్రవిచారంబును, విజ్ఞానవిరక్తులును, ఐశ్వర్య శౌర్యప్రభా దక్షత్వంబులును, స్మృతియు స్వతంత్ర్యమును, కౌశల కాంత ధైర్యమార్దవ ప్రతిభతిశయ ప్రశ్రయ శీలంబులును, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలంబులును, సౌభాగ్య గాంభీర్యంబులును, స్థైర్య శ్రద్థా కీర్తిమాన గర్వాభావంబులు ననియెడి ముప్పదితొమ్మిది గుణంబులు నవియునుగాక బహ్మణ్యతాశరణ్యతాది మహాగుణ సమూహంబును, కృష్ణదేవుని యందు వర్తించుఁ గావున. (400)