Jump to content

పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

65


శరీరంబులు సంహరించి నిజశరీరంబు విడిచె. సంహారమునకు నిజశరీర పరశరీరములు రెండు నీశ్వరునకు సమంబులు, నిజరూపంబున నుండుచు, రూపాంతరంబుల ధరించి క్రమ్మఱ నంతర్థానంబు నొందు నటునికైవడి లీలాపరాయణుండైన నారాయణుండు మీన కూర్మాది రూపంబులు ధరియించుం బరిహరించునని చెప్పి మఱియు నిట్లనియె. (380)


క. ఏ దినమున వైకుంఠుఁడు, మేదినిపైఁ దాల్చినట్టి మేను విడిచినాఁ

డా దినమున నశుభ ప్రతి, పాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యెన్. (381)

ధర్మరాజు పరీక్షిన్మహారాజునకుఁ బట్టంబుఁ గట్టి మహాప్రస్థానంబున కరుగుట

సీ. కలవర్తనంబునఁ గ్రౌర్య హింసాసత్య దంభ కౌటిల్యా ద్యధర్మచయము

పురముల గృహముల భూములఁ దనలోనఁ దలపోసి కరిపురమున

మనుమని రాకవై మనుమని దీవించి సింధుతోయ కణాభిషిక్తుఁ జేసి

యనిరుద్ధ నందనుండైన వజ్రనిఁ దెచ్చె మథురఁ బట్టముగట్టి మమతఁ బాసి

ఆ. కరలఁ దురగములన గంకణాదికముల, మంత్రిజనుల బుధుల మానవతుల

నఖిలమై ధనము నభిమన్యుసుతునకు, నప్పగించి బుద్ధి నాశ్రయించి .(382)


వ. విరక్తండైన ధర్మనందనుండు ప్రాజాపత్య మనియెడి యిష్టి గావించి, యగ్నుల నాత్మారోపణంబు సేసి, నిరహంకారుండును నిర్దశితాశేష్ బంధనుండు నై, సకలేంద్రియంబుల మానసంబున నణంచి, ప్రాణాధీన వృత్తియగు మానసంబును బ్రాణమందుఁ, బ్రాణము నపానమునందు, నుత్సర్గ సహితంబైన యపానము మృత్యువందును, మృత్యువును బంచభూతములకు నైక్యంబైన దేహంబునందును, దేహము గుణత్రయము నందును, గుణత్రయంబు నవిద్య యందును, సర్వారోప హేతువగు నవిద్యను జీవిని యందును, జీవుండైన తన్నునవ్యయంబైన బ్రహ్మ మందును లయింపం జేసి, బహి రంతరంగ వ్యాపారంబులు విడిచి, నారచీరలు ధరియించి, మౌనియు నిరాహారుండును ముక్తకేశుండును నై యున్మత్తపిశాచ బధిర జడుల చందంబున నిరపేక్షకత్వంబున . (383)


క. చిత్తంబున బ్రహ్మము నా, వృత్తము గావించుకొనుచు విజ్ఞాన ధనా

యత్తలు దొల్లి వెలింగెడి, యుత్తర దిశ కేగె నిర్మ లోద్యోగమునన్. (384)