పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63


చెలికాఁడ ! రమ్మని చీరు న న్నొకవేళ మఱఁది ! యనుచు

బంధుభావంబునఁ బాటించు నొకవేళ దాతయై యుకవేళ ధనము లిచ్చు

మత్రమై యొకవేళ మంత్ర మాదేశించు బోద్దయై యొకవేళ బుద్దిసెప్పు

సారథ్య మొనరించుఁ జనివిచ్చు నొకవేళఁ గ్రీడించు నొకవేళ గేలిసేయు

తే. నొక్క శయ్యాసనంబున నుండుఁ గన్న, తండ్రికైవడిఁ చేసినత్తప్పుఁ గాఁచు

హస్తములువట్టి పొత్తున నారగించు, మనుజవల్లభ ? మాధవు మఱవరాదు . (367)


క. విజయ ! ధనంజయ ! హనుద్ద్యజ ! ఫల్గున ! పాండురాజతనయ ! నర ! మహేం

ద్రజ ! మిత్రర్జున ! యచును, భుజములు తలకడవ రాకపోకలఁ జీరున్ (368)


క. వారిజగంధులు దమలో, వారింపఁగరాని ప్రేమ వాదము సేయున్

వారిజనేత్రుఁడు ననుఁ దగ, వారిండ్లకుఁ బనుపు నలుక వారింప నృపా ! (369)


క. నిచ్చలు లోపలి కాంతలు, మచ్చికఁ దనతోడ నాడు మాతలు నాకున్

మువ్వటల సెప్పు మెల్లన, విచ్చలవిడిఁ దొడలమీద విచ్చేసి నృపా ! (370)


చ. అటమటమయ్యె నాభజన మంతయు భూవర ! నేఁడు చూడుమా

యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటన్

బటుతర దేహలోభ్మునఁ బ్రాణము లున్నవి వెంటఁ బోక, నే

గటాకట ! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో ! (371)


శా. కాంతారంబున నొంటిఁ దోడుకొన రాఁగాఁ జూచి, గోవింద శు

ద్ధాంతస్త్రీలఁ బదాఱువేల మద రాగాయత్తులై, తాఁకి, నా

చెంతన్ బోయలు మూఁగిపట్టికొన, సీమంతినీసంఘమున్

భ్రాంతిన్ భామిని భంగి నుంటి విడిపింపన్ లేక, ధాత్రీశ్వరా ! (372)


శా. ఆ తేరా రథకుండు నా హయము లా యస్త్రాసనం బా శర

వ్రాతం బన్యలఁ దొల్లిఁ జంపును, దుదిన్ వ్యర్థంబులై పోయె మ

చ్చేతోధీశుఁడు చక్రి లేమి, భసితక్షిప్తాజ్య మాయావి మా

యాతంత్రోషరభూమి బీజముల మర్యాద న్ని మేషంబునన్. (373)


మ. యదువీరుల్ మినినాథు శాపమునఁ గాలాధీనులై, యందఱున్

మదిరాపాన వివర్థమాన మద సమ్మర్దోగ్ర రోషాంధులై ,

కదనంబుల్ దమలోన ముష్టిహతులం గావించి నీఱైరి, న

ష్టదశం జిక్కిరి నల్గు రేవు రచటన్ సర్వంసహావల్లభా ! (374)