పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62


శా. వైరుల్ గట్టిన పుట్టముల్ విడువఁగా వారింప నా వల్లభుల్

రారీవేళ, ను పేక్షసేయఁ దగవే? రావే/ నివారింపవే ?

లేరే ? పత్రాతలు కృష్ణ ! యందు సభలో లీనాంగియై కుయ్యడన్

గారుణ్యంబున భూరి వస్త్రకలితంగాఁ జేయుఁడు ? ద్రౌపదిన్. (361)


సీ. దుర్వాసుఁ డొసనాఁడు దుర్యోధనుఁడు వంప పదివేల శిష్యులు భక్తిఁ గొలుపఁ

జనుదెంచి మనము పాంచాలియుఁ గిడిచిన వెనక నాహారంబు వేఁడుకొనినఁ

బెట్టద ననపుడుఁ బెట్టకున్న శపింతు ననుచుఁ దో యావగాహమున కేగఁ

గడవల నన్నశాకములు దీఱుట చూచి పాంచాల పుత్రిక పర్ణశాల

తే. లోన వెఱచిన, విచ్చేసి లోవిలోని, శిష్ట శాకాన్న లవము ప్రాశించి, తపసి

కోప ముడిగించి, పరిపూర్ణ కుక్షిఁజేసె, నిట్టి త్రైలోక్య సంతర్పియెందుఁగలఁడు ? (362)


సీ. పందికై పోరాడి ఫాలాక్షుఁ డేవ్వని బలమున నా కిచ్చెఁ బాశుపతము !

నెవ్వని లావున నీ మేన దేవేంద్రు పీఠార్థమున నుండు పెంపుఁ గంటిఁ  !

గాలకేయ నివాత కవచాది దైత్యులఁ జంపితి నెవ్వని సంస్మరించి !

గోగ్రహణమునాఁడు కురుకులాంభోనిధిఁ గడచితి ! నెవ్వని కరుణఁ జేసి

ఆ. కర్ణ సింధురాజు కౌరవేంద్రాదుల, తలల పాగలెల్లఁ దడవి తెచ్చి

యే మహాత్ము బలిమి నిచ్చితి ! విరటుని, పుత్రి యడుగ బొమ్మపొత్తికలకు. (363)


మ. గురు భీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశ చక్రంబులో

గురుశక్తిన్ రథయంతయై, నొగలపైఁ , గూర్చుండి, యా మేటి నా

శరముల్ వాఱకమున్న వారల బలోత్సాహాయు రుద్యోగ త

త్పరతముల్ చూడ్కుల సమ్హరించె నమితోత్పాహంబు నాకిచ్చుచున్. (364)


మ. అసురేంద్రుం డొసరించు కృత్యములు ప్రహ్లాదుం బ్రవేశించి గె

ల్వ సమర్థంబులు గాని కైవడిఁ గృపాశ్వత్థామ గాంగేయ సూ

ర్యసుతు ద్రోణ ధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచంబు నా

దెసకున్ రాక తొలంగ మాధవు దయా దృష్టిన్ నరేంద్రోత్తమా ! (365)


చ. వసుమతి, దివ్యబాణముల ప్రక్కలువాపి, కొలంకుసేసి, నా

రసముల మాతాగాఁ బఱపి, రథ్యములన్ రిపులెల్లఁ ,జూడ, సా

హసమున నీట బెట్టితి రణావని సైంధవుఁ జంపునాఁడు నా

కసురవిరోధి భద్రగత నండయి వచ్చినఁగాదె ? భూవరా ! (366)