పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

అర్జునుండు ద్వారక నుండి వచ్చి ధర్మరాజునకుఁ గృష్ణనిర్యాణమును గూర్చి తెలియజెప్పుట

క. భేదమున నింద్రసూనుడుఁ, యాదవపురినుండి వచ్చి, యగ్రజుఁ, గని, త

త్పాదముల నయన సలిలో, త్పాదకుడై పడియె దీనుభంగి నరేంద్రా ! (343)


క. పల్లటిలిన యుల్లముతోఁ దల్లడపడుచున్న పిన్న తమ్మునిఁ గని వె

ల్వెల్ల నగు మొగముతో జని, లెల్లన విన ధర్మపుత్రుఁ డిట్లని పలికెన్. (344)


సీ. మాతామహుండైన మన శూరఁ డన్నాఁడె ? మంగళంమే మన మాతులునకు ?

మోదమే నలుగురు ముగురు మేనత్తల ? కానందమే వారి యాత్మజులకు ?

నక్రూర కృతవర్మ లాయుస్స మేతులే ? జీవితుఁడే యుగ్రసేన విభుఁడు

గల్యాణ యుక్తులే గద సారణాదులు మాధవు తమ్ములు మానధనులు ?

తే. నందమే? మన సత్యక నందనునకు, భద్రమే ? శంబరాసుర భంజనునకుఁ

గుశలమే? బాణాదనుజేంద్రు కూఁతుపతికి, హర్షమే? పార్థ ! ముసలికి హలికి బలికి. (345)


వ. మఱియును నంధక మధు యదు భోజ దాశార్హ వృష్ణి సాత్వతు లనియెడి వంశంబుల వీరులును, హరి కుమారులై న సాంబ సుషేణ ప్రముఖులును, నారాయణాను చరులైన యుద్ధావాదులును, కృష్ణసహచరులై న సునందాదులును సుఖానందులే? యని యందఱ నడిగి ధర్మజుండు గ్రమ్మఱ నిట్లనియె. (346)


సీ. వైకుంఠవాసుల వడువున నెవ్వని బలమున నానంద భరితులగుచు

వెఱవక యాదవవీరులు వర్తింతు, రమరులు గొలువుండు నట్టి కొలువు

చవికె నాకర్షించి చరణ సేవకులై న బంధు మిత్రాదుల పదతుగమున

నెవ్వఁడు ద్రొక్కించె, నింద్రపీఠము మీఁద, వజ్రంబు జళిపించి వ్రాలువాని

తే. ప్రాణవల్లభ కెంగేలఁ బాదుచేసి, యమృతజలములఁ బోషింప నలరు పారి

జాత మెవ్వఁడు కొనివచ్చి సత్యభాను, కిచ్చె, నట్టి మహాత్మున కిపుడు శుభమె ? (347)


శా.అన్నా ! ఫల్గున ! భక్తవత్సలుఁడు బ్రహ్మణ్యుండు గోవిందుఁ డా

పన్నానీక శరణ్యుఁ డీశుఁడు జగద్భద్రానుసంధాయి శ్రీ

మన్నవ్యాంబుజ పత్రనేత్రుఁడు సుధర్మమధ్య పీఠంబునం

దున్నాఁడా ! బలభద్రుఁగూడి, సుఖియై, యుత్సాహియై, ద్వారకన్. (348)


క. ఆ రామ కేశవులకును, సారామల భక్తి నీవు సలుపుదువు గదా ?

గారాములు సేయుదురా ? పోరాముల బంధు లెల్లప్రొద్దు జితారీ ! (349)