పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57


యనాథులు దీనులునగు నామ తల్లిదండ్రులు నమం బాసి యే మయ్యెదరొ? యెట్లు వర్తించుదురొ? యని వగవం బనిలేదు. అజ్ఞానములం బగు స్నేహంబున నైన మనోవ్యాకులత్వంబు పరిహరింపు మని మఱియు నిట్లనియె).(1-323)


ఆ. అట్టి కాలరూపుఁ డఖిలాత్ముఁ డగు విష్ణుఁ , డసురనాశమునకు నవతరించి

దేవకృత్యమెల్లఁ దీర్చి చిక్కినపని, కెదురు సూచుచుండు నిప్పు డధిప! (1-324)


మత్తకోకిల. ఎంతకాలము గృష్ణుఁ డీశ్వరుఁ డిద్ధరిత్రిఁ జరించు,మీ

రంతకాలము నుండుఁ డందఱు, నవ్వలం బనిలేదు, వి

భ్రాంతి మానుము, కాలముం గడవంగ నెవ్వరు నోప, రీ

తించయేల? నరేంద్రసత్తమ! చెప్పెదన్ విను మంతయున్ . (1-325)


వ. ధృతరాష్ట్రుడు గాంధారీ విదురు సహితుండై హిమవత్పర్వత దక్షినభాగంబున నొక్క మునివనంబున జని, తొల్లి సప్తఋషులకు సంతోషంబు సేయుకోఱుచు, నాకాశగంగ యేడు ప్రవాహంబులై పాఱిన పున్యతీర్థంబున గృత స్నానుండై యథావిది హోమ మెనరించి, జలభక్షనంబు గావించి, సకల కర్మంబులువిసర్జించి, విఘ్నంబుఁ జెందక, నిరాహారుండై, యుపశాతాత్ముఁ డగుచు, పుత్రార్ధదారైషణంబులు వర్జించి, విన్యస్తాసనుండై, ప్రాణంబులు నియమించి, మనస్సహితంబులైన చక్షు రాదీంద్రియంబులు నాఱింటిని విషయంబులం ప్రవర్తింపనీక నివర్తించి, హరిభావనారూపంబగు ధారణా యోగంబుచే రజ స్సత్త్వతమో రూపంబులగు మలంబుల మూఁటిని హరించి, మనంబు నహంకారస్పదంబైన స్థూలదేహంబువలనం బాపి, బుద్ధియందు నేకీకరణంబుచేసి, యట్టి విజ్ఞానాత్మను దృశ్యాంశంబువలన వియోగించి, క్షేత్రజ్ఞుని యందుఁ బొందింది ద్రష్ట్రంశంబువలన క్షేత్రజ్ఞునిం బాసి, మహాకాశంబుతోడ ఘటాకాశముం గలుపు కైవడి నాధారభూతంబైన బ్రహ్మమందుఁ గలిపి, లోపలి గుణక్షోధంబును, వెలుపలి యింద్రియ విక్షేపంబును లేక నిర్మూలిత మాయాగుణ వాసనుండగుచు, నిరుద్ధంబులగు మనశ్చక్షురాదీంద్రియంబులు గలిగి, యఖిలహారంబులను వర్జించి, కొఱడు చందంబున. (1-326)


మ. ఉటజాంతస్థల వేదికన్ నియతుఁడై యునాఁడు నేఁ డాదిగా

నిటపై నేనవనాఁడు మేన్ విడువఁగా నిజ్యాగ్ని యోగాగ్నిత

త్పట దేహంబు దహింపఁ జూచి, నియమ ప్రఖ్యాత గాంధారి యి

ట్టటు వో నొల్లక, ప్రాణనవల్లభునితో నగ్నిం బడుం భూవరా ! (1-327)