49
గల్పించి, నిరాయుధుండై సంహారంబుసేసి, శాంతుండై పిదపం గాంతామధ్యంబునఁ
బ్రాకృత మనుష్యుండునుం బోలె, సంచరింపుచుండె నా సమయంబున. 270
క.
మతు లీశ్వరుని మహత్వ్తము
మిత మెఱుఁగని భంగి నప్రమేయుఁడగు హరి
స్థితి నెఱుఁగక కాముకుఁడని
రతములు సలుపుదురు తిగిచి రమణులు సుమతీ! 271
క.
ఎల్లపుడును మా యిండ్లను
వల్లభుఁడు వసించు మేమ వల్లభలము శ్రీ
వల్లభున కనుచు గోపీ
వల్లభుచే సతులు మమతవలఁబడి రనఫూ! 272
వ.
అని చెప్పిన విని సూతునకు శౌనకుం డిట్లనియె. 273
అధ్యాయము - 12
సీ. గురునందనుడు సక్రోధుఁ డై యేసిన బ్రహ్మశిరోనామ బాణ వహ్నిఁ
గుంపించు నుత్తర గర్భంబు గ్రమ్మఱుఁ బద్మలోచనుచేతఁ బ్రతికె సండ్రు
గర్భస్థుఁడగు బాలు గంసారి యేరితి బ్రతికించె? మృత్యువు భయము వాపి
జనియించి యతుఁడెన్ని సంవత్సరము లుండె? నెబ్భంగి వర్తించె నేమి సేసె?
ఆ. వినుము శుకుడు వచ్చి విజ్ఞాన, నతని కెట్లు సూపె నతఁడు పిదపఁ
దన శరీర మే విధంబున వర్జించె? విప్రమ్ముఖ్య! నాకు విస్తరింపు.(1-274)
వ. అనిన సూతుండు డిట్ల్నియె.ధర్మనందనుడు చతుస్సముద్ర ముద్రితాఖిల జంబూద్వీపరాజ్యంబు నార్జించియు,మిన్నుముట్టిన కీర్తి నుపార్జించియు,నంగనాతురంగ మాతంగ సుభట కాంచనాది దివ్యసంపదలు సంపాదించియు,వీరసోదర విప్ర విద్వజ్జన వినోదంబులం బ్రమోదించియు,వైభవంబు లలవరించియుఁ,గ్రతువు లాచరించియు,(దుష్ట శిక్షణ,శిష్టరక్షణంబు లొనరించియు) ముకుంద చరణారవింద సేవారతుండై,సమస్త సంగంబులంచు నభిలాషంబు వర్జించి,యరిషడ్వార్గంబు జయించి రాజ్యంబు సేయుచు.(1-275)
తే. చందనాల నాఁకట స్రగ్గువాఁడు,దనివి నొందని కైవడి ధర్మసుతుడు
సంపదలు పెక్కుగలిగియుఁ,జక్రిపాద,సేవనంబులఁబరిపూర్తి సెందకుండె.(1-276)