పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

మ.

కొడుకుల్‌ భక్తివిధేయు లౌదురుగదా? కోడండ్రు మీ వాక్యముల్‌

కడవం బాఱక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా?

తొడవుల్‌ వస్త్రములం బదార్థ రస సందోహంబులు జాలునా?

కడమల్‌ గావు గదా? భవన్నిలయముల్‌ గల్యాణ యుక్తంబులే? 265


సీ.

తిలక మేటికి లేదు? తిలకినీ తిలకమ! పువ్వులు దుఱుమవా? పువ్వుఁబోణి!

కస్తూరి యలఁదవా? కస్తూరికాగంధి! తొడవులు తొడవవా? తొడవు తొడవ!

కలహంసఁ బెంపుదే? కలహంస గామిని! కీరంబుఁ జదివింతె? కీరవాణి!

లతలఁ బోషింతువా? లతికా లలితదేహ! సరసి నోలాడుదె? సరసిజాక్షి!

ఆ.

మృగికి మేఁతలిడుదె? మృగశాబ లోచన! గురుల నాదరింతె? గురువివేక!

బంధుజనులఁ బ్రోతె? బంధుచింతామణి! యనుచు సతుల నడిగె నచ్యుతుండు. 266


వ.

అని యడిగిన వారలు హరిం బాసిన దినంబులందు శరీర సంస్కార కేళీవిహార

హాస మందిరగమన మహోత్సవ దర్శనంబు నొల్లని యిల్లాండ్రు గావున. 267


మ.

సిరి చాంచల్యము తోడి దయ్యుఁ దనకుం జిత్తేశ్వరుండంచు నే

పురుషశ్రేష్ఠు వరించె నట్టి పరమున్‌ బుద్ధిన్‌ విలోకంబులన్‌

గరయుగ్మంబులఁ గౌఁగిలించిరి సతుల్‌ గల్యాణ బాష్పంబు లా

భరణ శ్రేణులుగాఁ బ్రతిక్షణ నవప్రాప్తాను రాగంబుల¦. 268


మత్తకోకిల.

పంచబాణుని నీఱుచేసిన భర్గునిం దనవిల్లు వ

ర్జించి మూర్ఛిలఁ జేయఁజాలు విశేష హాస విలోకనో

దంచితాకృతు లయ్యుఁ గాంతలు దంభచేష్టల మాధవు¦

సంచలింపఁగఁ జేయ నేమియుఁ జాలరైరి బుధోత్తమా! 269


వ.

ఇవ్విధంబున సంగ విరహితుండైన కంసారి సంసారికైవడి విహరింప నజ్ఞాన

విలోకులైన లోకులు లోకసామాన్య మనుష్యుండని తలంతురు. ఆత్మాశ్రయ

యైన బుద్ధి యాత్మయందున్న యానందాదులతోడం గూడని తెఱంగున నీశ్వరుండు

ప్రకృతితోడం గూడియు నా ప్రకృతిగుణంబులైన సుఖదుఃఖంబులఁ

జెందక యుండు. పరస్పర సంఘర్షణంబులచే వేణువుల వలన వహ్నిఁ బుట్టించి

వనంబుల దహించు మహావాయువు చందంబున, భూమికి భారహేతువులై

యనేకాక్షౌహిణులతోడం బ్రవృద్ధతేజు లగు రాజుల కన్యోన్య వైరంబులు