పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

సీ.

కలుముల నీనెడి కలకంఠి యెలనాఁగ వర్తించు నెవ్వని వక్షమందు

జనదృక్చకోరక సంఘంబునకు సుధా పానీయపాత్ర మే భవ్యుముఖము

సకల దిక్పాలక సమితికి నెవ్వని బాహుదండంబులు పట్టుఁగొమ్మ

లాశ్రితశ్రేణి కే యధిపతి పాద రాజీవయుగ్మంబులు చేరుగడలు

ఆ.

భువన మోహనుండు పురుషభూషణుఁ డట్టి కృష్ణుఁడరిగె హర్మ్యశిఖర

రాజమానలగుచు రాజమార్గంబున రాజముఖులు గుసుమరాజిఁ గురియ. 255


మ.

జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళ చ్ఛత్రంబుతోఁ జామరం

బులతోఁ బుష్పపిశంగ చేలములతో భూషామణి స్ఫీతుఁడై

నలినీబాంధవుతో శశిద్వయముతో నక్షత్రసంఘంబుతో

జలభిచ్చాపముతోఁ దటిల్లతికతో భాసిల్లు మేఫూకృతి¦. 256


వ.

ఇట్లు తల్లిదండ్రుల నివాసంబు సొచ్చి దేవకీప్రముఖలైన తల్లుల కేడ్వురకు

మ్రొక్కిన. 257


క.

బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు

జడ్డన నంకముల నునిచి చన్నులతుదిఁ బా

లొడ్డగిలఁ బ్రేమభరమున

జడ్డువడం దడసి రక్షిజలముల ననఫూ! 258


వ.

తదనంతరం బష్టోత్తరశతాధిక షోడశసహస్ర సౌవర్ణసౌధ కాంతంబైన శుద్ధాం

తంబు సొచ్చి హరి తన మనంబున. 259


మ.

ఒక భామాభవనంబు మున్ను సొర వేఱొక్కర్తు లోఁ గుందునో!

సుకరాలాపము లాడదో! సొలయునో! సుప్రీతి నీక్షింపదో!

వికలత్వంబున నుండునో! యనుచు నవ్వేళన్‌ వధూగేహముల్‌

ప్రకటాశ్చర్య విభూతిఁ జొచ్చె బహురూప వ్యక్తుఁడై భార్గవా! 260


వ.

ఆ సమయంబున. 261

క.

శిశువులఁ జంకలనిడి తను

కృశతలు విరహాగ్నిఁ దెలుప గృహగేహళులన్‌

రశనలు జాఱఁగ సిగ్గుల

శశిముఖు లెదురేగి రపుడు జలజాక్షునకు¦. 262


మ.

పతి నా యింటికి మున్ను వచ్చె నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా

గతుఁడయ్యెన్‌ మును సేరెఁ బో దొలుత మత్కాంతుడు నాశాల కే

నితరాలభ్య శుభంబు గంటి నని తా రింటింట నర్చించి ర

య్యతివల్‌ నూఱుఁ బదాఱువేలు నెనమం డ్రవ్వేళ నాత్మేశ్వరు¦. 263


వ.

వారలం జూచి హరి యిట్లనియె. 264