పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43


వ. తత్సమయంబునం బౌరసుందరులు ప్రాసాద శిఖరభాగంబుల నిలిచి గోపాలసుందరుని సందర్శించి మార్గంబుల రెండు దెసలఁ గరారవిందంబులు సాచి యొండొరులకుం జూపుచుం దమలోనం, "దొల్లిటం బ్రళయంబున గుణంబులం గూడక జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు ప్రవర్తింపని సమయంబునఁ బ్రపంచాత్మకుండు నద్వితీయుండు నగుచు మేలై దీపించు పురాణపురుషుం డీతం"డనువారును, "జీవులకు బ్రహ్మత్వంబు గలుగ లయంబు సిద్ధించుట యె"ట్లనువారును, "జీవనోపాధిభూతంబులైన సత్త్వాది శక్తుల లయంబు జీవలయం"బనువారును, "గ్రమ్మఱ నప్పరమేశ్వరుండు నిజవీర్య ప్రేరితయై నిజాంశ భూతంబులైన జీవులకు మోహినియైన సృష్టి సేయ నిశ్చయించి నామరూపంబులు లేని జీవులందు నామరూపంబులు గల్పించు కొఱకు వేదంబుల నిర్మించి మాయానుసరణంబు సేయు"ననువారును "నిర్మల భక్తి సముత్కంఠా విశేషంబుల నకుంఠితులై జితేంద్రియులగు విద్వాంసు లిమ్మహాభావు నిజరూపంబు దర్శింతు"రనువారును, "యోగమార్గంబులం గాని దర్శింపరా"దనువారు నై. (1-234)


మ. రమణీ ! దూరము వోయెఁ గృష్ణు రథమున్ రాదింక వీక్షింప ; నీ

కమలాక్షుం బొడఁగానలేని దినముల్ కల్పంబులై తోఁచు ; గే

హములం దుండఁగ నేల ? పోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మి నుం

దము రమ్మా ! యనె నొక్క చంద్రముఖి కందర్పాశుగ భ్రాంతయై. (1-235)


మ. తరుణీ ! యాదవరాజు కాఁ డితఁడు ; వేదవ్యక్తుఁడై యొక్కఁడే

వరుసన్ లోక భవస్థితి ప్రళయముల్ వర్తింపఁగాఁజేయు దు

స్తర లీలారతుఁడైన యీశుఁ ; డితనిన్ దర్శించితిన్ బుణ్య భా

సుర నేనంచు నటించె నొక్కతె మహాశుద్ధాంతరంగంబునన్. (1-236)


కం. తామస గుణులగు రాజులు, భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ స

త్త్వామల తనుఁడై యీతఁడు, భామిని ! వారల వధించుఁ బ్రతికల్పమునన్. (1-237)


సీ. ఈ యుత్తమ శ్లోకుఁ డెలమి జన్మించిన, యాదవ కులమెల్ల ననఘమయ్యె

నీ పుణ్య వర్తనుం డే ప్రొద్దు నుండిన, మథురాపురము దొడ్డ మహిమ గనియె

నీ పురుషశ్రేష్ఠు నీక్షించి భక్తితో, ద్వారకావాసులు ధన్యులైరి

యీ మహాబలశాలి యెఱిఁగి శాసింపఁగా, నిష్కంటకంబయ్యె నిఖిల భువన