పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

కథనీయంబైన శ్రీ మహాభాగవత నిగమ వ్యాఖ్యాన మే రీతి సాఁగె ? అయ్యోగిముఖ్యుండు గృహస్థుల గృహంబున గోవును బిదికినయంత తడవు గాని నిలువఁడండ్రు. అతండు గోదోహన మాత్ర కాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబులగు. పెద్ద కాలం బేక ప్రదేశమున నెట్లుండె ? భాగవతోత్తముండైన జనపాలు జన్మకర్మంబు లే ప్రకారంబు ? వివరింపుము. (1-76)


సీ. పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ

బరిపంథి రాజులు భర్మాది ధనముల నర్చింతు రెవ్వాని యంఘ్రియుగముఁ

గుంభజ కర్ణాది కురుభట వ్యూహంబు సొచ్చి చెండాడె నే శూరు తండ్రి

గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చె నే వీరు తాత

ఆ.వె. యట్టి గాఢకీర్తి యగు పరీక్షిన్మహా, రాజు విడువఁదగని రాజ్యలక్ష్మిఁ

బరిహరించి గంగఁ బ్రాయోపవిష్టుఁడై, యసువులుండ నేల యడఁగి యుండె. (1-77)


ఉ. ఉత్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్నడున్

జిత్తములందుఁ గోరరు హసించియు లోకులకెల్ల నర్థ సం

పత్తియు భూతియున్ సుఖము భద్రముఁ గోరుదు రన్యరక్షణా

త్యుత్తమమైన మేను విభుఁ డూరక యేల విరక్తిఁ బాసెనో ? (1-78)


కం. సారముల నెల్ల నెఱుగుదు, పారగుఁడవు భాషలందు బహువిధ కథనో

దారుఁడవు మాకు సర్వముఁ , బారము ముట్టంగఁ దెలియఁ బలుకు మహాత్మా ! (1-79)

వ్యాసుండు వ్యాకులచిత్తుండై చింతించుట

వ. అని యడిగిన శౌనకాది మునిశ్రేష్ఠులకు సూతున్ డిట్లనియె. తృతీయంబైన ద్వాపర యుగంబు తీఱు సమయంబున నుపరిచర వసువు వీర్యంబున జన్మించి వాసవి నాఁదగు సత్యవతియందుఁ బరాశరునికి హరికళం జేసి విజ్ఞానియైన వేదవ్యాసుండు జన్మించి యొక్కనాఁడు బదరికాశ్రమంబున సరస్వతీ నదీజలంబుల స్నానాది కర్మంబులం దీర్చి శుచియై పరులు లేనిచోట నొంటిఁ గూర్చుండి సూర్యోదయము వేళ నతీతానాగత వర్తమానజ్ఞుండై యా ఋషి వ్యక్తంబు గాని వేగంబు గల కాలంబునం జేసి యుగధర్మంబులకు భువి సాంకర్యంబు వొందు. యుగయుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి సన్నంబగు. పురుషులు నిస్సత్త్వులు