పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

స్వరూపుండై పరమానందంబున విరాజమానుండగు. ఇట్లు తత్త్వ జ్ఞానంబు సెప్పుదురని సూతుం డిట్లనియె.(1-65)

చం. జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ

ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్

వినుతులు సేయుచుండుదురు వేద రహస్యములందు నెందుఁ జూ

చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్. (1-66)


మ. భువనశ్రేణి నమోఘ లీలుఁ డగుచున్ బుట్టించు రక్షించు నం

త విధిం జేయు మునుంగఁ డందు బహుభూత వ్రాతమం దాత్మ తం

త్ర విహారస్థితుఁడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్

దివిభంగిన్ గొనుఁ జిక్కఁ డింద్రియములన్ ద్రిప్పున్ నిబంధించుచున్. (1-67)


చం. జగదధినాథుఁ డైన హరి సంతత లీలలు నామరూపముల్

దగిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్

మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే ?

యగణిత నర్తనక్రమము నజ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే ? (1-68)


ఉ. ఇంచుక మాయ లేక మది నెప్పుడు వాయని భక్తి తోడ వ

ర్తించుచు నెవ్వఁడేని హరిదివ్య పదాంబుజ గంధరాశి సే

వించు నతం డెఱుంగు నరవిందభవాదులకైన దుర్లభో

దంచితమైన యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్. (1-69)


మ. హరిపాదద్వయభక్తి మీ వలన ని ట్లారూఢమై యుండునే ?

తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్

ధరణీదేవతలార ! మీరలు మహా ధన్యుల్ సమస్తజ్ఞులున్

హరిచింతన్ మిముఁ జెంద వెన్నడును జన్మాంతర్‌వ్యథాయోగముల్. (1-70)

శ్రీమద్ భాగవత రచనాది వృత్తాంతము

సీ. పుణ్యకీర్తనుఁడైన భువనేశు చరితంబు, బ్రహ్మతుల్యంబైన భాగవతము

సకల పురాణరాజముఁ దొల్లి లోకభ్,అద్రముగఁ బుణ్యముగ మోదముగఁ బ్రీతి

భగవంతుఁడగు వ్యాస భట్టారకుఁ డొనర్చి, శుకుఁ డనియెడు తన సుతుని చేతఁ

జదివించె నింతయు సకల వేదేతిహా,సముల లోపల నెల్ల సారమైన