పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

యులై సంచరింప విష్ణుయశుండను విప్రునికి కల్కి యను పేర నుద్భవింపం గలండని యిట్లనియె. (1-61)


మ. సరసిం బాసిన వేయి కాలువల యోజన్ విష్ణునందైన శ్రీ

కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్

సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణు నంశాంశముల్

హరి కృష్ణుండు బలానుజన్ముఁ డెడలే దావిష్ణుఁడౌ నేర్పడన్. (1-62)


కం. భగవంతుండగు విష్ణువు, జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్

దగ నవ్వేళల దయతో, యుగయుగమునఁ బుట్టి కాఁచు నుద్యల్లీలన్. (1-63)


ఆ.వె. అతిరహస్యమైన హరిజన్మ కథనంబు, మనుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ

జాల భక్తి తోడఁ జదివిన సంసార, దు:ఖరాశిఁ బాసి తొలఁగిపోవు. (1-64)

వ. వినుండు. అరూపుండై చిదాత్మకుండై పరఁగు జీవునికిఁ బరమేశ్వరు మాయా గుణంబులైన మహదాది రూపంబుల చేత నాత్మస్థానంబుగా స్థూల శరీరంబు విరచితంబైన గగనంబునందుఁ బవనాశ్రిత మేఘ సమూహంబును, గాలియందుఁ బార్థివ ధూళి ధూసరత్వంబును నే రీతి నట్లు ద్రష్ట యగు నాత్మయందు దృశ్యత్వము బుద్ధిమంతులు కానివారి చేత నారోపింపంబడు. ఈ స్థూలరూపంబున కంటె నదృష్ట గుణంబై యశ్రుతంబైన వస్తువగుటం జేసి వ్యక్తంబు గాక సూక్ష్మంబై కర చరణాదులు లేక జీవునికి నొండొక రూపము విరచితంబై యుండు. సూక్ష్ముండై జీవుని వలన నుత్‌క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు. ఎపుడీ స్థూల-సూక్ష్మ రూపంబులు రెండు నవిద్యం జేసి యాత్మకుఁ గల్పింపంబడె ననియెడి హేతువు వలన స్వరూప సమ్యగ్ జ్ఞానంబునఁ బ్రతిషేధింపఁబడు నపుడె జీవుండు బ్రహ్మ యగు. సమ్యగ్ జ్ఞానంబె దర్శనంబు. విశారదుండైన ఈశ్వరునిదై క్రీడించు నవిద్య యనంబడుచున్న మాయ యెప్పుడు విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు జీవోపాధి యైన స్థూల-సూక్ష్మ రూపంబు దహించి కాష్ఠంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునఁ దాన యుపరత యగు. అపుడు జీవుండు బ్రహ్మ