పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

77


సమర్థులముగాము. నిన్ను నొడంబఱచి యొక విన్నపంబుఁ జేసెదము. నిన్నుఁ దెలియక మాయకు లోనైనంతగాలంబు నీ లీలకు లోనైన వారము. తెలిసితిమేని నీ దాసులయ్యెదము. అటుగావున యీ రెండు తెఱంగుల నీవారమే. ఈ విధంబుననుండి నీవుచేసిన చేఁతలయ్యె. నన్ను నీ వెప్పుడైన రక్షింపకతప్పదు. నీకు నాకు స్వామిభృత్య న్యాయంబు తప్పదు. సిద్ధంబు. ఇట నీ నామంబును మఱవనివాఁడను.. తొల్లి నీవు రామావతారంబున విశ్వామిత్ర యజ్ఞ సంరక్షణంబుఁ జేసి జనకునింటికిఁ బోవుత్రోవను నహల్యయు దృణగుల్మల తాదులు నీ పాదంబులు సోకి పావనంబయ్వెనట ! అవి యే తవంబులఁ జేసినవి. మాకును నీ షాదంబులే గతి. శ్రీ వేంకటేశ్వరా !

165

మాయాశరీరధారీ ! కామాతురుండై న జీవుండు నీ పాదంబుఁ దలంచెనేని యాకాంతదేహంబకాని ప్రకాశమానంబైన నీ పాదంబు తనమనంబు లోపలికిరాదు. తాఁ దొల్లిఁ జూచిన రూపభావంబు లోపలికిఁ జూచిన విరహంబుఁ బుట్టించుఁ గాని ఫలంబులేదు. దీనికి బాహ్యంబులైన యింద్రియద్వారంబులు వెలుపలికి సాధనంబులు. తన మనస్సే తన్నుఁ లోనికింద్రిప్పు. అటుగావున నీ సాధనంబుల చేతను వెలుపల నీ మూర్తులు దర్శించి యా రూపంబులు, తన మనంబున ధరించి నిన్నుఁ గనుగొనుచుండెనేని బ్రహ్మానుభవమై విలసిల్లి ఫలియించును. ఇవి రెండును నీ మహిమలే. వివేకించి నేర్చినవారికి యరచేతిలోనిది ముక్తి. శ్రీ వేంకటేశ్వరా !

166

రమాకళత్రా ! నీవు విరజానదీతీరంబున వైకుంఠనగర వాసుండవై ముక్తా రత్న వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాద్యలంకార శోభితంబైన మేడమాడుగులయందు మాణిక్య శోభితంబైన సహస్ర 'ఫణంబులఁ బ్రజ్వరిల్లెడు నాది శేషుండు నీకుఁ బానుపై శోభిల్లఁగా,