పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

{{rh|76|శ్రీ వేంకటేశ్వర వచనములు| }


162

స్వామీ ! అయస్కాంతంబునకు ముఖంబు చేసి చూచిన సూదులతి త్వరితంబు నంటుకొనినయట్లు స్త్రీలకుఁబురుషులకు నన్యోన్యావ లోకంబునకు నంటుకోనం 'జేయుచున్నది నీ మాయ. అది యెట్టు తప్పించు కొనవచ్చును ? తింత్రిణీశలాటువులు బాలకు నోరూర్చినట్లు సువర్ణంబునకుఁ జిత్తంబు లాసపడం జేయుచున్నది నీ ప్రభావంబు. ఇది యెట్లుగాదని త్రోయవచ్చు. దొంగిలించుక పోవంగాఁ దలవరులు 'పాశంబులఁగట్టి తెచ్చి ద్రవ్యంబులు దొంగల 'మెడఁ గట్టి యేఁగించినట్లు చేసినకర్మంబు లనుభవింపంజేయుచున్న నీ సామర్ధ్యంబు నేరీతిఁ దప్పించుకొనవచ్చు ? ఇంక నీజీవుల కే చందంబుగా నిక్కట్లు దీరికడతేర వచ్చు ? అమృతపుఁగుండ యొద్ద నుండఁగాను నాఁకట నలయ నేమిటికి ? నీవు నాకుఁ గలవు. నీ పాదంబులు గొలిచి బ్రతికెదను. శ్రీ వేంకబేశ్వరా !

163

నాగకంకణ చాపఖండనా ! తాను దొలుజన్మంబునం జేయు కర్మంబులనుభవింపక పోరాదు. అది మాకు శక్యంబుగాదు. మేము గావిం చిన నేరఁబులు మా మీఁద నుండఁగాను నీకు నేమని విన్నవించుకొని యెదము. నీ దాస్యం బను వజ్రపంజరమున్నది. నీ నామస్మరణంబు లని యెడి ఖడ్గంబులున్నవి. నీవే మాపై దయఁదలంచి విచారించెదవు. శ్రీ వేంక టేశ్వరా !

164

అమృతమథనా! మహార్హులు మిమ్ముఁ గోరి యతిఘోరతపంబుఁజేతురు. పశులు దేహంబుల గూళ్లు పెట్టి , నఖశిఖపర్యంతమును జీమల పుట్టలఁ బెట్టు నట ! ఇటువంటి నియమంబులు చేసికొని నిన్నెట్లు ధ్యానంబుఁ జేసి మెప్పించెదము. ఈ మార్గంబులు. మావంటివారికి నతిదుర్లభంబులు నీకుఁ జేతులెత్తి మ్రోక్కం గలవార మింతియగాని యింత లేసి పనులకు