పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

69

జరారోగ హరంబైన యాచార్య తళిగె ప్రసాదంబను కవళంబు మేపి, ద్వయంబనియెడి జూలు గట్టించి, యష్టాక్షరంబనియెడి ఘంటలు గట్టించి, రామానుజ సిద్దాంతం బనియెడు మురజఁ గట్టించి, కృష్ణ రాహుత్తుం డని యెడి మావంతు నొక్కించి భాగవత సజ్జారంబునం గట్టి, యితర కింకరదోష హరంబనియెడి తుళసిదండలు దిష్టి దండలుగాఁ బూన్చి, యితగం బనియెడి భారినిగళంబు విడిపించి, నీ చరమార్దంబనియెడి యంకు శంబుఁ జేతఁబట్టి యిట్టట్టు కదలనీయక, నీ తద్దాస సంసర్గ గతులకు లీలావినోదంబుగా నెక్కుడు శత్రుక్షయమిచ్చి క్షేమంబు పాలించుకొఱకునై పదునాలుగు దొంతర చెఱువులు దాటించి యావల బహుపాపహరంబైన విరజానది లో స్నానపానాదులు సేయించి పరిశుద్దాత్మునిఁగాఁ జేసి శంఖచక్రపీతాం బర వన మాలికా భరితునింగాఁ జేసి, యిందిరా స్తన్య పానం బనియెడి యుగ్గు పెట్టించి సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదవు లిత్తు వని సర్వ లోక జనులు కొనియాడగాఁ బాడగాఁ బేరుకొనఁగా విని నీ వలమేలుమంగా లక్ష్మీ సమేతుండవు గావున నీ కనంతంబులైన విన్న ఫములు చేసికొని కొనియాడెదను. పాడెదను. శ్రీ వేంకటేశ్వరా !

150

అలమేలుమంగాపతీ ! అవధారు దేవా ! దేవా ! చిత్తావధారు ! నావిన్నపంబు విన నవధరింపుము. నిరాకారంబై వాయువు స్వరూపం బై యున్న జీవుని మాతృగర్భంబనియెడు నిరవుననుంచి శుక్ల పక్షంబున శుక్ల శోణితరూపంబున బదరీఫలప్రమాణంబునఁ జేసి, ద్వితీయ మాసంబునఁ గుక్కుటాండస్వరూపంబునఁ జేసి, తృతీయ మాసంబున మయూ రాండస్వరూపంబునంజేసి, చతుర్ద మాసంబున నారికేళ ప్రమాణంబునఁ జేసి, పంచమ మాసంబున శోణితాండరూపంబునఁ జేసి, పాణ్మా సంబునఁ బంచతంత్రంబులతోఁగూడిన దశవాయువుల స్వరూపం బై యున్న లింగశరీరంబున నున్న కర్మజీవునిం దెచ్చి తదీయ 'సూక్ష్మతనువందుఁ జొరఁదోలి మాంసశోణితంబు లాహారంబులు సేసితివట! సప్తమ మాసంబున జీవునిఁ ధత్వజ్ఞానవరునిఁ జేసితివట ! అష్టమ మాసంబుస