పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

శ్రీ వేంకటేశ్వర వచనములు

దము. గురుముఖంబునను నీ కృపవలనను స్వామి నని నిన్ను నెఱింగికొంటిమి. నీవు పెట్టిన చెట్టు నీవే యీడేర్పవలయును. తరువాతి బుద్ధులు నీవే యనుగ్రహించి మమ్ముఁ గృతార్థులం జేయవే శ్రీ వేంకటేశ్వరా !

144

వాలినిగ్రహణా ! నీపై భక్తిఁ జేయునదెల్ల నన్ను నీవు రక్షింతువని యెడిన్వ కార్యంబు కొఱకే. నీవు మమ్ముఁ బాయక యంతర్యామియై, యుండెడిదంతయును నీవు మాకుఁ జేసిన పరమోపకారంబే, నే నస్వతం త్రుఁడ. నీవు స్వతంత్రుఁడవు, నే నగుణుండ. నీవు గుణాతీతుండవు. నే నశక్తుండ. నీవు సర్వశ క్తిధరుండవు. నే నిన్ను ధరించుకొననోప. నీవు నన్ను ధరింపనోపుదువు, నానేరుపు నేరము లెంచం బని లేదు. నీకీర్తి ప్రతాపంబు లెంచుకొని నీ మహిమలు మెఱసి నన్నుఁ బోషించుట నీకుం బుణ్యము. ఎలుఁగుబంటికి జూలు వ్రేగనరాదు. తీగెకుఁ గాయ భార మనరాదు. కామధేనువునకుఁ గొమ్ములు వేస టనరాదు. మా చిరభారం బులు నీవే దహించుకొనవే శ్రీ వేంక టేశ్వరా !

145

మారీచహరణా ! నీవు ధర్మసంస్థాపనంబు సేయు నెపంబువలన ననంతావతారంబులై యపరాధంబులు సేసిరని దుర్జనులైన రావణాదులను సంహరించితివి. ఊరకున్న జీవులచేతను బాపంబులు సెయింపనేల ? వారిని రాక్షసులుగాఁ బుట్టింపనేల ? నీవు జన్మంబు నొంద నేల ? మొదలనే సుజ్ఞానులం జేసిన నీకేమి వెలితియయ్యెడిని. నీవు స్వతంత్రుండవు. నీవు లేక జగంబులోనఁ దృణంబు సలింపదని యండ్రు. నిన్ను మీఱిన పను లేమియున్నవి. నీవు తప్పు చేయవనుతలంపున మే మొకటియెంచు గొంటిమి. దేవతిర్యజ్మనుష్య స్థావరాదులకు నీయవతారంబులు సేవించి బ్రతుకుం డనియెడి యుపకారంబు గాఁబోలు నియ్యది. శ్రీ వేంక టేశ్వరా !