పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

53

నకు నిఖిలవస్తులాభంబులు నీపాదంబు లేయని తలంచుకొని తృప్తింబొంది యేకాంతంబునందే కాని సంసారంబు చేయుచుండి కాని నిన్ను ధ్యానంబు 'సేయుట యోగరహస్యంబు. ఇదియే తపంబు, ఇందులనే సకలసిద్ధులును సిద్దించు. తొల్లిటి మును లీరీతినే నిన్ను భజియించి ఘనులై రి.' మఱి కొంద ఱీమార్గంబున నేమియుం గోరక మీ శరణుసొచ్చి మిమ్ముఁ గొల్చి ముక్తులైరి. కావున మునుపడి సేవించు నుద్యోగంబులు జీవులవి. తర్వాత రక్షకత్వంబు నీది; శ్రీవేంక టేశ్వరా !

117

త్రిగుణాతీతా ! చతుర్భుజాకారా! కానరాని బ్రహ్మము నెవ్వరుఁ జూప లేరు, కానవచ్చియున్న నీమాయ లెవ్వరు మాన్పలేరు. కలది భక్త సులభుండవని చదువులలో నిన్నుఁ జెప్పంగాఁ జెవులు చల్లంగా వినుటయొకటి, కన్నుల పండువుగా నీమూర్తులు దర్శించుట యొకటి, నీరూ పులు మనంబునఁ దలపోయు టోకటి, కరంబుల నీకు మ్రొక్కు టొకటి, నీనామంబులు జపియించు టొకటి. ఇంతియ కాని వేఱోక్క యుపాయంబు మఱి లేదు. విచారించిన నాత్మ పరమాత్మదర్శనంబు లసాధ్యంబులు, కర్మంబులు కోరి చేసిన బంధంబులగు. కోరక చేసిన నిన్నుఁ గనుఁగొను టకు; నన్ని చందంబుల మీకు శరణనుట మేలు; శ్రీవేంకటేశ్వరా ! .

118

రుక్మిణీవల్లభా ! మహాపాతకంబులు చేసిన జీవులు పాషాణంబులై వృక్షంబులై తృణగుల్మలతాదులై పుట్టుదురని చెప్పుదురు. జగం బంతయు నివియ నిండుకొనియున్నవి. బ్రహ్మాండంబును పాపంబు నిండు కొన్నది. చెప్పవే, యెట్లాయహల్య నీపాదంబుసోకి పాషాణత్వం బుడిగి పావనం బయ్యె? నిటువంటి యీ చరాచరముల నంతర్యామివై నిండుకయుండఁగా నీ జీవుల పాపంబు లప్పుడే పోయిన బాధి తానువృత్తి నున్నవి 'యో కాక వారి నిర్బంధంబులు దోఁచకుండంజేసి మీ లీలకుం గైంక ర్యంబు గొనుచున్నాఁడవొ కాక మీ ధ్యానకల్పన ఘటియించుకొన్నాఁ డవో; శ్రీ వేంక టేశ్వరా !