పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

శ్రీ వేంకటేశ్వర వచనములు

లనుభవించిన మంచిదే యేలినవారి పనులయెడం బంటునకు నేమీ వాటిల్లిన నేలిక కేకలవు. నీవే రక్షించెదవుగాక అందులకు వెఱవఁబని లేదు. నీవు గలవని నమ్మి నిర్భయత్వంబున నుదాసీనత్వంబున నుండవలసి నది. నీదాసులైన వైష్ణవులకు పరమపదంబు సిద్ధంబు. ఆడ్యులై మిమ్ము మఱచినవారికి సంసారమేగతి. ఇటువంటి లోకుల నీడు పెట్టుకొనవలదు. ప్రపన్ను లై నవారలకు నీవు రక్షకుండవు; శ్రీ వేంకటేశ్వరా !

114

పురాణపురుషా ! అప్రతిహత ప్రతా పుండవు. అవాప్త సకలకాముండవు. అఘటనఘటనా సమర్థుండవు. అపార కృపానిధివి, అశరణశరణ్యుం డవు. అసంఖ్యాతకల్యాణగుణుండవునైన నీ వల్లభవాండంబు నీపాదంబు గోట గీరిన నీరై పాఱెను. నీవు గావలయుననిన నర్జునుని ప్రతిజ్ఞ కోఱకుఁ బగలు రాత్రి యయ్యెను. ఇటువంటివి నీమహిమలు. ఘంటాకర్లుండు నెక్కడ 'మొఱలిడె? కుబేరుపట్టం. బెక్కడఁ గరుణించితివి ? సరయూ తీరంబున పరమపదంబు చూఱలిచ్చితివి. ఇప్పుడు శేషాచలంబునందు వరంబు లొసంగెదవు. నీవు గరుణించిన నీకసాధ్యంబేది ? నీకిది సహ జంబు; శ్రీ వేంక టేశ్వరా !

115

భక్తవత్సలా ! కన్ను లెదుట గోచరించిన వన్ని యును నీరూపంబు లే. శబ్దంబు లన్నియు నీయనంతనామంబులే, జలంబు లన్నియు నీ శ్రీపాదతీర్థంబు లే, ఫలమూలాదు లన్నియు నీప్రసాదంబు లే జీవకోట్లు నీదాసులే. తలంపున నిల్చినవి నీధ్యానంబులే. చేతులఁ జేసినవన్నియు నీకైంకర్యంబు లే. జగంబు వైకుంఠంబే. యజ్ఞ ంబులు మహాత్సవంబు లే. సకలసంపదలు నీ యుపకరణంబు లే. ఇటువలే భావించియేకదా నీభాగ వతులు భవంబులు గెల్చిరి, ఇహపరములు చెందిరి; శ్రీవేంకటేశ్వరా !

116

గదాధరా ! బుద్ధిమంతుఁడైన యతండు దేహధారణమాత్రంబులు సుంతభోగంబులు గైకొని యితరంబు 'లేమియుఁ గోరక అంతరంగంబు