పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు


111

పరమేశ్వరా ! నాశరీరంబు నాకు రథంబు. నాపుణ్య పాపంబులే గుఱ్ఱంబులు. నాయాసలే పగ్గంబులు. నాకామక్రోధంబులే యాయుధంబు లుగాఁ గైకొని జన్మపరంపరల నిహపరలోకంబుల సంచరించిన విజయ పురుషుండ నేను. నీవు జగన్నాథుండ వనఁగా విని యిప్పుడు నిన్నుం, గొల్చితిని. సుజ్ఞానధనంబు జీతంబు పెట్టి యేలుము. ఇంతకాలంబు నీమా యలం బరగిన మర్మజ్ఞండ నేను నీకు సేవకుండనై యుండుట నీకు మేలు; శ్రీ వేంకటేశ్వరా !

112

రాధావల్లభా ! సకల యజ్ఞంబులకంటె జ్ఞానయజ్ఞం బధికంబనియును, అందులఁ గర్మఫలంబు లన్నియు సమాప్తంబులై పోవుననియును, అది నీ వెఱుంగుమనియును, తత్వవేత్తలకు దండంబు వెట్టి ప్రార్థించి యడిగితేను వారు నీ కీజ్ఞానంబుపదేశించెద రనియును, ముందర నీయాత్మ లో నీవే యెఱుంగుదువనియును అర్జునునకు పెద్దలం జూపి చెప్పితివి మొదల; నా తర్వాత నీవే వహించుకొని అన్ని ధర్మంబులు నంటు పెట్టి నాకు శరణుసొచ్చిన మాత్రాన 'నే రక్షింతు నని సత్యంబు చేసి యిది యెవ్వరికిఁ జెప్పకుమని యితర తత్వము మాని నిన్నె కొలువంగట్టడ చేసితివి. అటుగాన కేవలజ్ఞానులకుఁ గర్మంబులు చేయనిదోషంబులు లేవను టాయెను. ద్విజాతులు నీయాజ్ఞా కైంకర్యంబులు సేయుదురు. కాన యవియును వారలకు బంధకంబులుగావు. నీవు పెట్టిన చిక్కు నీవే తీర్చితివి; శ్రీ వేంకటేశ్వరా !

113

పాంచజన్యధరా ! అనాది కాలంబున నుండియు జీవులం బాయలేక ఆత్మలోనుండుదు వది యంతకంటెను లాభంబింక నేమి వెదకెడిది? జీవులంటిమా నిత్యులు. వారీ కై చింతింపవలదు. నీ లీలార్థంబైన శరీరంబులు మోచినవారలుం గావున ప్రాకృతవి కారంబులైన సుఖదుఃఖము