పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

శ్రీ వేంకటేశ్వరవచవములు

మాకు నిన్నింత శోధించి యడుగం బనియేమి? నీకు నిష్టంబు సేయుటే మాకుఁబ్రయోజనంబు. నీకెంత కాముకత్వంబు ప్రియంబై నంబోలు ! "నేఁటనుండి మేము నిన్ను శ్రీ భూమినీళాసమేతుండవని, వ్రజాంగనానాథుండవని, అష్టమహిషీప్రాణవిభుండవని, శతో త్తరపోడశ సహస్ర కాంతారమణుండ వని నుతించెదము; శ్రీ వేంకటేశ్వరా ! .

109

భూపతీశా ! భూలోకంబున నన్నుఁ బలుమాఱు పుట్టించెదనని నీకేమైన వ్రతంబా? నాకు నన్ని వేడుకలు నొసంగెదననియెడు నుదా రత్వగుణంబుగాక? నీప్రకృతి నన్ను సతతంబుఁ బాయకుండెడి; నాతోడి దిఛలంబా, సకలభోగంబులు నన్ను ననుభవింపఁ జేసెద ననియెడు మాతృవాత్సల్యంబుగాక, ఈరీతి మిారు పాలించి సంసార సౌఖ్యంబులు ప్రసాదింపఁగా నుల్లంఘించి మోక్షంబు గోరెడు మంకుతనంబు నాకుఁ దగదు. మీరు నియమించినట్లు నిచ్చలు మెలంగు టే నాకు ధర్మంబు. అయినం గాని యింకొకవిన్నపంబు చేసికొనియెద విన 'నవధరింపుము. నామనంబులో మీరుండవలె, కన్ను లను మీ మహోత్సవంబులఁ జూడ వలె; వీనుల మీకథలు వినంగావలె. నోటికి మీకీర్తనంబు కృపచేయవలె. నిదియె నాకుఁ బరమపదంబు; శ్రీ వేంకటేశ్వరా !

110

శ్రీనివాసా ! దేహంబులై పొదిగెడిది నీ మాయయట. అందులోని చైతన్యంబు నీవట, కోరికోరి సుఖదుఃఖంబు లనుభవించువారు జీవులట, ఇన్ని చందంబులం గలిగెడు ఫలంబులు స్వర్గనరకంబులట. ఇవీ యెన్నటికి దెగని కర్మబంధంబులట, ఈ సంసారంబు చేసి కూడఁ బెట్టంగా మిగిలిన లాభంబులు పుణ్యపాపంబులట. ' ఇవి నీకు లీలావినోదంబులట. దీనికి తుద యేది మొదలేది? ఇటువలె ననాదియై సత్యమై జరగుచున్నదిప్రపంచంబు. ఈ యర్ధంబుఁ దెలియఁ దరముగాదు. ఇంక నేమని విన్న వించవచ్చు? మీచిత్తంబు నాభాగ్యము! శ్రీవేంక టేశ్వరా!