పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచవములు

49


106

అనిరుద్దా ! నిత్యంబును జీవులు నిద్రాసమయంబున నంతర్యామివై సంతుష్టుఁడవై యున్న నీయందుఁ బ్రవేశించి యందే. నీవు సృష్టింపగాఁ గలలుగని మేలుకొని యింద్రియ ద్వారంబుల లోకవ్యాపారంబులు చూచిబ్రమయుదురుగాని నీయందు నుండియు నిన్నెఱుంగరు. గర్భంబులలో నున్న శిశువులు తల్లుల రూ పెఱుంగనియట్లు నిన్నుఁ దెలియ నేరక చదు వులలో వెదకుదురు, నీ వున్న నెలవు తమ యంతఃకరణం బని యెఱుం గరు. నే మెటువలె నుండిన నేమి ? నీవు. పూసలలో దారమై యున్నాఁ డవు. నీ సన్ని ధానంబున నున్న వారిని నీవే కరుణింపవలయు; శ్రీ వేంక టేశ్వరా !

107

శ్రీహరీ : భువిలోన శునకసూక రాదుల వానివాని జన్మంబులు సుఖంబు లౌనట్లుగా నడపుచున్నాఁడవు. నరకబాధ లనుభవించు వారికి యాతనాదేహంబు లలవరించి ఛేదన తాడనాదులచేఁ దదంగం బులు మఱియును దొలిపించుచు బాధ ననుభవింపఁ జేయుచున్నాఁడవు. శరీరంబులు నిర్బంధంబులు గావున నిన్నిటికిని నీవు గలుగంగా సుఖదుఃఖంబు లనుభవించుటలు సులభంబాయెను. నీవు దయా నిధివి. నిన్నుఁ గొల్చినవారికి నీవు కామధేనుకల్పవృక్ష చింతామణులై ఫలియించుట గంటిమి; శ్రీ వేంకటేశ్వరా !

108

శ్రీకృష్ణా ! నిన్ను గోపికావల్ల భుండ వని నియమంబున జపియించిన వారికిం బ్రసన్నుండ వగుచున్నాఁడవు, అవులే; నీ జారత్వంబుం దడవిన నీకు వేడుకపుట్టెడినో కాక నీ మర్మంబు దడవినవారల నుపచరించుటో కాక యిట్టి ప్రసంగంబులం దలంచిన మనస్సు కరంగునో కాక యహల్వా జారుండ వని నొడివిన నింద్రుండు మెచ్చుచో నీవును నుపేంద్రుండ నని వంశానుచారంబైన వ్రతంబు జరపుటో తెలియరాదు.