పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

శ్రీ వేంకటేశ్వర వచనములు

చతురంగ బలంబులతోఁ దోడుసూపంగల బంట నీకు ; నామీఁద నేమి యపరాధంబు గలిగిన నోర్చుకొనుము ; శ్రీ వేంకటేశ్వరా !

65

ఆనందనిలయా ! మిమ్ము దర్శించుసమయంబున నొక కానుక గావలసి యపూర్వ వస్తు వెట్టిదో యని వెదకి వెదకి మఱియుఁ గొందఱు నడుగంగాను, వార లొండేమి యడుగుచున్నాఁడ వని హుంకారధిక్కా రంబులచేత భర్జింపగాను వారలం దిరిగి కోపింపక యందులకు నొదిఁగి శాంతి గైకొని వర్తించితి. అంత నీ కామక్రోధ విరహితం బయిన శాంతమే కా యుత్తమ వస్తు వని నా మనోవీథిం గంటిని. అది నీకుఁ గానుకగాఁ దెచ్చితిని. అది యమూల్యము. తులాభార హిరణ్య గర్భాది మహాదానంబు లిందులకు సరిగావు. అష్టాంగ యోగంబుల సిద్ధులు నిందులోనే యున్నవి. తపంబునఁ బొందెడు మహిమయును దీన సిద్దించును. నీ విందులకు సంతోషింతు వని యిది మేలై న వస్తువు గనుక సర్వేశ్వరుండ వయిన నీ ముందరం బెట్టక పోరా దని సమ్ముఖం బున నిల్పితిని, నా హృదయం బనియెడి భండారంబులోఁ బెట్టి పదిలంబుగా దాఁచుకొనుము, కొనుము; శ్రీ వేంకటేశ్వరా !

66

జ్యోతిర్మయా! నా కాఁపురంబు నీకు విన్నవించెద. మా పెద్దలు గడియించిన పూర్వాచార్యోక్త గ్రంథంబు లనియెడి వృత్తులు గలవు. అవి పలుమాఱు ద్రవ్వి త్రవ్వి నానా దేశంబుల శ్రీ వైష్ణవుల కృప లనియెడి పంటకాల్వలఁ బాఱించుకొని వ్యవసాయంబు సేసి ముందరగా నీ కైంకర్యమనియెడి మొలకలను విత్తి పైరుకొల్పి నీ యనుగ్రహమను కొల్చు పండించి మన స్సనియెడి కణఁజంబునం బెట్టితి. భాగవత ధర్మంబు లనియెడి పాఁడిపశువులను బరిపాలించుకొనుచుంటిని. నీ ధర్మం